Big Stories

UK PM Rishi Sunak ‘hurt and angry’: ఆ వ్యాఖ్యలు నన్నెంతగానో బాధించాయి: రిషి సునాక్

UK PM Rishi Sunak ‘hurt and angry’: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ లోగా నాయకులు ముమ్మర ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడడం లేదు. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ పై ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నేత వ్యక్తిగత విమర్శలు చేశారు. జాత్యాహంకార దూషణలు చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. ఆ వ్యాఖ్యలపై రిషి సునాక్ స్పందించారు. ఆ నేత ఆ విధంగా మాట్లాడడంతో తానెంతో బాధపడ్డానని, అవి తనకు ఆగ్రహం కూడా తెప్పిచ్చాయంటూ సునాక్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను తన ఇద్దరు కుమార్తెలు వినాల్సి వచ్చిందన్నారు.

- Advertisement -

‘ఆ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. కోపాన్ని కూడా తెప్పించాయి. ఆ పదాలను పునరావృతం చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. రిఫార్మ్ పార్టీ అభ్యర్థులు, ప్రచారకులు జాత్యాహంకార, స్త్రీద్వేష భాషను మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ పార్టీలో సంస్కృతి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది’ అంటూ రిషి అన్నారు. దక్షిణాసియా ప్రజల సంస్కృతిని ఉద్దేశిస్తూ రిఫార్మ్ పార్టీ ప్రచారకుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ నేత నిగెల్ ఫరేజ్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Also Read: చైనా కీలక నిర్ణయం, మాజీ రక్షణశాఖ మంత్రులపై బహిష్కరణ వేటు

దీనిపై నిగెల్ ఫరేజ్ స్పందించారు. తమ పార్టీ లేదా మద్దతుదారుల్లో కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే..జులై 4న బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రస్తుతం అక్కడ అధికారంలోకి ఉన్న కన్జర్వేటివ్ పార్టీ వెనుకంజలో ఉన్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. రిఫార్మ్ పార్టీ కూడా వందలాది అభ్యర్థులను బరిలో ఉంచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News