Big Stories

Two asteroids came to near Earth: భూమికి దగ్గరగా రెండు గ్రహ శకలాలు, అంతా సేఫ్

Two asteroids came to near Earth: భూమికి అతి పెద్ద ముప్పు తప్పింది. భారీ రెండు గ్రహ శకలాలు పుడమికి అతి సమీపంలోకి వచ్చాయి. కాసేపు అటు ఇటు తిరిగి మళ్లీ వెళ్లిపోయాయి. ఎలాంటి ముప్పు లేకపోవడంతో శాస్త్రవేత్తలతోపాటు మిగతావారు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

ఆదివారం అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం. సరిగ్గా అదే రోజు ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసు కుంది. భారీ రెండు గ్రహ శకలాలు పుడమికి అతి సమీపంలోకి వచ్చి వెళ్లాయి. వీటివల్ల ఎలాంటి ముప్పు కలగలేదు. ఒకదాని పేరు 2024 ఎంకె. ఈ గ్రహ శకలం 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి- చంద్రుడికి మధ్య దూరంలో దాదాపు 77 శాతంతో సమానం.

- Advertisement -

ఈ గ్రహ శకలాన్ని ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో బైనాక్యులర్ సాయంతో తిలకించారు. పుడమికి దగ్గరగా రావడం ఒకెత్తయితే, అతి పెద్దది కూడా. అది చాలా ప్రకాశవంతంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. దీన్ని గత నెల 16న గుర్తించారు శాస్త్రవేత్తలు రెండోది 2011 ఎల్ 21. దీని వెడల్పు 2.3 కిలోమీటర్లు. భూమికి దగ్గరగా వచ్చిన దానిలో ఇదీ మరొకటి.

ALSO READ: అవును.. నేను యువకుడిని కాదని నాకు తెలుసు.. కానీ,.. : జోబైడెన్

భూమికి దగ్గరగా ఉన్నప్పుడు అది 66 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. 1900 ఏడాది తర్వాత భూమికి సమీపానికి వచ్చిన వెళ్లిన గ్రహశకలాల్లో అతి పెద్దది. 20 మీటర్లు కంటే పెద్దదిగా ఉన్న శిలలు దాదాపు 50 లక్షల వరకు ఉంటాయని ఓ అంచనా. ప్రస్తుతం వచ్చి వెళ్లిపోయిన గ్రహశకలం పుడమి పైకి వస్తే ఊహించని నష్టం జరిగేదని అంటున్నారు శాస్త్రవేత్తలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News