Big Stories

Sunita Williams stuck on ISS: తిరుగు ప్రయాణంలో తిప్పలు.. రెండు వారాలుగా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్..!

Sunita Williams stuck on ISS: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం ISS లో చిక్కుకున్నారు. దీంతో సునీతా విలియమ్స్ మూడో రోదసి యాత్ర కూడా ఆటంకాలతోనే కొనసాగుతోంది. వ్యోమగామి బుల్ విల్మోర్‌తో కలిసి జూన్ 5న సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్లైనర్ రాకెట్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. తాజాగా వారి తిరుగు ప్రయణానికి ఇబ్బందులు కలగడంతో వ్యోమగాములు ఉన్న అంతరిక్ష నౌక రాక ఆలస్యం అయిందని యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్లడించింది.

- Advertisement -

సునీతా విలియమ్స్ ,బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారు భూమిపైకి తిరిగి వచ్చే సమయంపై ఇంకా క్లారిటీ రాలేదు. వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు రెండు వారాలు గడిచిపోయాయి. వ్యోమగాములు ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్‌ జూన్ 14న భూమిపైకి రావాల్సి ఉంది. కానీ పరిశోధనలు మిగిలే ఉండటంతో దీనిని వాయిదా వేశారు. తర్వాత జూన్ 26 కు మార్చారు. కానీ ఇప్పుడు కూడా అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని మరో సారి అంతరిక్ష నౌక ప్రయాణం వాయిదా పడిందని నాసా వెల్లడించింది.

- Advertisement -

బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో రెండు మానవ రహిత పరీక్షలు నిర్వహించారు. రెండూ ఫెయిల్ అవ్వడంతో అనంతరం మూడో సారి రూపొందించిన వ్యోమనౌకలో ఇద్దరు వ్యోమగాములను స్పేస్‌లోకి పంపించారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్యలతో పాటు, అవసరమైన అదనపు పరీక్షల కారణంగా వ్యోమనౌక రావడం ఆలస్యం అవుతోంది. వ్యోమనౌక తిరిగి వచ్చే సమయాన్ని ఇంకా నాసా ప్రకటించలేదు కానీ అన్నీ అనుకూలిస్తే జూలై 2న ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉందని నాసా తెలిపింది. ఐఎస్ఎస్ వెళ్లడానికి ముందు ప్రయోగం సమయంలో వివిధ సాంకేతిక సమస్యలు ఎదురవడంతో పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. చివరికి జూన్ 5న విజయవంతంగా నింగిలోకి బయలు దేరినా కూడా అక్కడకు చేరిన తర్వాత ఐఎస్ఎస్‌తో అనుసంధానంలో జాప్యం జరిగింది.

Also Read: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుడి మట్టి నమూనాతో తిరిగొచ్చిన చాంగే- 6

సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కాగా.. 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత మరో సారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలు ఆమె స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె అక్కడ గడిపారు. ఓ సారి మారథాన్ చేయడం కూడా విశేషం. మూడోసారి అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే సునీత విలియమ్స్ చేసిన డ్యాన్స్ వీడియో కూడా వైరల్ అయింది.

వాస్తవానికి సునీతా విలియమ్స్ వెళ్లిన వ్యోమనౌక స్పేస్‌లో 45 రోజులు మాత్రమే ఉండగలదు. ఐఎస్ఎస్‌కు సునీతా విలియమ్స్‌తో పాటు వెళ్లిన వ్యోమగామి బుల్ విల్మోర్ అమెరికా నేవీ టెస్ట్ పైలట్. బుల్ విల్మోర్ 2000లో నాసాకు ఎంపిక కాగా 2009 లో అంతరిక్ష యాత్ర చేశారు. రెండు అంతరిక్ష యాత్రల్లో ఆయన 178 రోజుల పాటు ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News