Big Stories

Suicide Drones to Taiwan: తైవాన్‌ చేతికి అమెరికా సాయుధ డ్రోన్లు..శత్రువులకు చుక్కలే!

America Approves Suicide Drones to Taiwan: తైవాన్‌కు అమెరికా సాయుధ డ్రోన్లు భారీ సంఖ్యలో తరలిపోతున్నాయి. అమెరికా, తైవాన్ మధ్య జరిగిన ఒప్పందంలో తైవాన్ దేశానికి అమెరికా సాయుధ డ్రోన్లు విక్రయించనుంది. ఇందులో భాగంగా ఆమోదముద్ర వేసింది. అయితే ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంలో సుమారు 1000కిపైగా సాయుధ డ్రోన్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

రష్యాకు ముప్పు తిప్పలు
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ముప్పు తప్పిన పెట్టిన డ్రోన్లు.. తాజాగా, తైవాన్ చేతికి అందనున్నాయి. దీంతోపాటు 60 మిలియన్ డాలర్ల విలువైన 720 స్విచ్ బ్లేడ్ డ్రోన్లు, ఫైర్ కంట్రోల్ వ్యవస్థలను తైవాన్‌కు అమెరికా అందించనుంది. అలాగే 291 ఆల్టియూస్ 600ఎం లాయిటరింగ్ ఆయుధాలు, సపోర్టింగ్ వ్యవస్థలు సరఫరా చేయనుంది. ఈ విషయాన్ని అమెరికా డిఫెన్స్ నుంచి ప్రకటన వెలువడింది.

- Advertisement -

వ్యతిరేకిస్తున్న చైనా..
తైవాన్‌పై గత కొంతకాలంగా సైనిక ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో సాయుధ డ్రోన్లతోపాటు ఇతర వ్యవస్థలను అమెరికా విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే అమెరికాలోని తైవాన్ రిలేషన్స్ యాక్ట్ కింద..దేశ ఆత్మరక్షణ చేసుకునేందుకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ, ఈ చర్యలను ఇప్పటికే చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవల షంగ్రిలో జరిగిన సదస్సులోనూ చైనా విమర్శలు చేసింది. కొంతమంది తైవాన్ అధికారులతో అక్రమంగా సంప్రదింపులు జరపడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించింది.

ఎలా పనిచేస్తాయంటే?
సాయుధ డ్రోన్లను ది స్విచ్ బ్లేడ్ పేరుతో అమెరికాకు చెందిన ఏరో వైర్మాన్మెంట్ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో స్విచ్ బ్లేడ్ 300, 600 వంటి రకాలు ఉంటాయి. అతి చిన్న సైజులో ఉన్న లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే గాల్లో చక్కర్లు కొడుతూ.. లక్ష్యం కనిపించగానే.. వాటిపై పడి దాడి చేసేవి. ఇవి సూసైడ్ డ్రోన్ కేటగిరిలోకి వస్తాయి. ఈ డ్రోన్లను సైనికుడు బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకొని ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్రోన్లను కొండలు, సముద్రాలు, గాల్లో నుంచి కూడా అనుకున్న లక్ష్యం వైపు ప్రయోగించవచ్చు. వీటిని ప్రయోగించిన తర్వాతే దీని రెక్కలు విచ్చుకొని గాల్లో డ్రోన్‌లా ఎగురుతుంది. వీటితో 10 కిలోమీటర్ల దూరం నుంచి సైనిక వాహనాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది.

Also Read:  హజ్ యాత్రలో విషాదం.. 550 మంది యాత్రికులు మృతి

స్విచ్ బ్లేడ్ 300 డ్రోన్లను కేవలం రెండు నిమిషాల్లో ప్రయోగానికి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ డ్రోన్లు సుమారు 2.5 కిలోల బరువు ఉంటుంది. ఈ డ్రోన్ల పొడవు విషయానికొస్తే.. 24 అంగుళాలు ఉంటుంది. ఈ డ్రోన్లు దాదాపు 10 కిలోమీటర్ల అవతల లక్ష్యాలను సైతం ఛేదిస్తాయి. అయితే ఈ డ్రోన్లు 500 అడుగుల కంటే తక్కువ ఎత్తులో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఎగరనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News