Big Stories

Putin North Korea Tour: నార్త్ కొరియా పర్యటనకు పుతిన్.. 24ఏళ్ల తర్వాత..

Russian President Putin North Korea Tour: గ్లోబల్ పాలిటిక్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోబోతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిని రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం నార్త్ కొరియా వెళ్లనున్నారు. 24 ఏళ్లలో పుతిన్ నార్త్ కొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి అని రెండుదేశాలు ప్రకటించాయి.

- Advertisement -

అమెరికాతో తీవ్రమవుతున్న ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని విస్తరించడంపై నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో పుతిన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కిమ్ ఆహ్వానం మేరకు పుతిన్ మంగళ, బుధవారాల్లో కొరియా పర్యటనకు వస్తారని నార్త్ కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు దేశాలపై కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నందుకు రష్యాపై, అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలు చేస్తున్నందుకు నార్త్ కొరియా.. ఇలా రెండు దేశాలు గ్లోబల్ అన్‌రెస్ట్‌కు కారణమవుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.

గతేడాది సెప్టెంబర్‌లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలో పర్యటించారు. గతంలో వీరి భేటీ ప్రపంచాన్ని ఆకర్షించింది. మాస్కోలో పుతిన్, కిమ్ భేటీ అయ్యి రెండు దేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్యాంగ్‌యాంగ్ ఆయుధాలు సరఫరా చేసిందని కిమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వార్తలను కిమ్ ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కలిగిన రష్యా కూడ ఈ వార్తలను ఖండించింది.

Also Read: అందుకు మీరు ఒప్పుకుంటే మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం: రష్యా

పుతిన్ చివరి సారిగా జూలై 2000 సంవత్సరంలో ప్యాంగ్‌యాంగ్‌ను సందర్శించారు. మళ్లీ 24 ఏళ్ల తర్వాత పుతిని నార్త్ కొరియా పర్యటన గ్లోబల్ పాలిటిక్స్‌ను ఏ మాత్రం ప్రభావవంతం చేస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News