Big Stories

Russian President Putin: వియత్నాంతో పుతిన్‌ భేటీ..విక్ట‌రీ డే సంబ‌రాల‌కు ఆహ్వానం

Russian President Putin arrives in Vietnam: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..ఉత్తర కొరియాలో పర్యటన ముగించుకొని వియత్నాం చేరుకున్నారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా తర్వాత నేరుగా అక్కడినుంచి ఆయన వియత్నాం వెళ్లారు. ఈ మేరకు పుతిన్‌కు హనోయిలో ఘన స్వాగతం లభించింది. అంతకుముందు ఉత్తర కొరియాలో కూడా ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ సైతం పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

హనోయి విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వియత్నాం దేశ డిప్యూటీ ప్రధాని ట్రాన్ హాంగ్ హా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌తో పుతిన్ విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతిక, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే అణు శాస్త్ర సాంతకేతికతపై ఉమ్మడి పరిశోధనకు సైతం అంగీకరించారు.

- Advertisement -

Also Read: మక్కాలో తీవ్రమైన వేడి.. 90 మంది భారతీయులు మృతి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వియత్నాం దేశంలో పర్యటన చేపట్టడాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేపట్టిన పుతిన్..మద్దతు కోసం ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో మద్దతు కోసం ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే వియత్నాం ప్రధాని టో లామ్‌తో పుతిన్ భేటీ అయ్యారు. వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యత అని రష్యా పేర్కొంది. అలాగే 2025లో జరగనున్న విక్టరీ డే సంబరాలకు రావాలని టో లామ్‌ను పుతిన్ ఆహ్వానించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News