Big Stories

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. భాగస్వామ్య దేశాల మద్దతు కోరిన జెలెన్ స్కీ

Ukraine Russia War: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. అయితే దీనికి నిరసనగా ఆదివారం 30 డ్రోన్లతో ఉక్రెయిన్ మస్కోపై దాడి చేసింది. రష్యా , ఉక్రెయిన్ వార్ ప్రారంభమై నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడి చేసింది. ఖార్కివ్‌లో రష్యా నాలుగు చోట్ల బాంబు దాడులు చేసింది.

- Advertisement -

అయితే రష్యా చేసిన ఈ బాంబు దాడిలో ముగ్గురు మరణించారు. దాదాపు 41 మంది గాయపడ్డారు. బాధితులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని గవర్నర్ ఒలేహ్ సినిహుబోవ్ తెలిపారు. అయితే ఈ దాడులు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది. వరుస దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిన్ జెలెన్ స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేయాలని మిత్ర దేశాలను కోరాడు.

- Advertisement -

Also Read: నాసా హెచ్చరిక.. నేడు భూమి వైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం

ఉక్రెయిన్‌కు ఆధునిక వైమానిక రక్షణ అవసరం. కీవ్ ప్రాంతంలో రాత్రంతా రష్యా క్షిపణి దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అంతే కాకుండా నివాస, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. రష్యాను ఎదుర్కునేందుకు, సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు ఆయుధాలను వినియోగించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా భాగస్వామ్య దేశాలు తమకు సాయం చేయాలని అని జెలెన్ స్కీ వీడియోలో తెలిపారు. కీవ్ ప్రాంతంలో రష్యా ప్రయోగించిన మూడు క్షిపణుల్లో రెండింటిని ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని వైమానిక దళ కమాండర్ వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News