Big Stories

Russian attacks on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 12మంది మృతి

Russian attacks on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడికి పాల్పడింది. ఆ దేశ తూర్పు ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అంతకుముందు జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా..12 మందికి గాయాలయ్యాయి.

- Advertisement -

అదే విధంగా రష్యాపై ఉక్రయిన్ డ్రోన్ దాడి చేసింది. కుర్‌స్క్ లో జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

జపోరిజ్జియా సమీపంలోని విల్నియన్స్ వద్ద జరిగిన దాడిలో చాలామంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్క్సీ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో రష్యా క్షిపణి దాడి చేసిందన్నారు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతోపాటు ఏడుగురు మరణించినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు ఆయుధాలను పంపిణీని వేగవంతం చేయాలని మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా, రష్యన్ సైన్యం తూర్పు ఉక్రెయిన్ పై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ భయంకరమైన దాడుల్లో 11మంది మృతి చెందారు. అలాగే దినిప్రో నగరంలో రష్యా నిర్వహించిన దాడుల్లో 10 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది.

గత 24 గంటల్లో రష్యా బలగాలు ఏకంగా 13 సార్లు జనావాస ప్రాంతాలపై డ్రోన్ల వర్షం కురిపించింది. విల్నియానన్స్క్ లో జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు.

Also Read: నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రశంసలు

అయితే రాత్రికి రాత్రే రష్యా డ్రోన్లను కూల్చి వేసినట్లు కీవ్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్‌లో రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. ఈ దాడులతో మౌలిక సదుపాయాలు, ఇంధన, విద్యుత్, ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీస్తున్నాయని ఉక్రెయిన్ వాపోయింది. మరోవైపు రష్యాలోని కుర్స్క్ నగరంలో ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఐదుగురు మృతిచెందినట్లు క్రెమ్లిన్ వెల్లడించారు. కాగా, ఆ ఉక్రెయిన్ డ్రోన్లను ట్వెర్, బ్రయాన్స్క్ బెల్గోరోడ్, క్రిమియాలలో కూల్చి వేసినట్లు రష్యా ప్రకటించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News