Big Stories

UK Elections 2024: బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు.. తేలనున్న రిషి సునాక్ భవితవ్యం

UK General Elections 2024: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 650 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం జూలై 4 ఉదయం 7 గంటలకు ప్రధాని పదవి కోసం ఓటింగ్ ప్రారంభం అయింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి జనం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మరో వైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రధాని రిషి సునాక్ ఓటు వేశారు. అనంతరం ఎక్స్ వేదికగా ఓటర్లకు సందేశం ఇచ్చారు.

- Advertisement -

పోలింగ్ ప్రారంభం అయిందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బందుల ఎదుర్కుంటుందని అన్నారు. అందుకే కన్జర్వేటివ్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా 650 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలి అంటే 326 సీట్లు అవసరం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలో అధికారిక కన్జర్వేటివ్ పార్టీకి, కెయిర్ స్టార్మర్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 46.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసి ప్రధానిని ఎన్నుకోనున్నారు.

- Advertisement -

ఎన్నికల కోసం 40 వేల పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిటన్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ప్రధానిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శుల వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని హోదాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగతున్న సునాక్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి.

Also Read: బైడెన్ క్లారిటీ, రేసులో ఉన్నా.. గెలుపు మనదే అంటూ..

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి ఖాయం అంటూ అత్యధిక పోల్స్ అంచనా వేస్తున్నాయి. 2019లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 365 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 202 సీట్లకే పరిమితం అయింది. ఇక ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరి సొంతం అవుతుందనేది త్వరలోనే  తేలనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News