Big Stories

Putin: అందుకు మీరు ఒప్పుకుంటే మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం: రష్యా

Putin latest statement on war(Today’s international news): ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం గత రెండేళ్లకు పైగా ఎలాంటి ముగింపు లేకుండా కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఆక్రెయిన్ కు ఆఫర్ ఇచ్చారు. అయితే, అందుకు రెండు షరతులు విధించారు. ఆ రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

ఈ విషయంపై రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం. కాల్పుల విరమణకు ఆదేశాలతోపాటు చర్చలు కూడా ప్రారంభిస్తాం. అయితే, ఉక్రెయిన్ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలి. నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీవ్ కు షరతు విధించారు. తుది పరిష్కారం విషయమై ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అయితే, ఒకవైపు జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.

- Advertisement -

Also Read: జీ7 సమ్మిట్.. వివిధ దేశాల సుప్రీమ్స్‌తో ప్రధాని మోదీ భేటీ..

ఉక్రెయిన్ కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు గతంలో రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్యను ఉక్రెయిన్, పశ్చిమదేశాలు ఖండించాయి. రష్యా దళాలు ఆక్రమించి విలీనం చేసుకున్న ఆ నాలుగు ప్రాంతాలతోపాటు 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా వదిలివెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తున్నది. అయితే, రష్యా ఇచ్చిన ఆఫర్ ఉక్రెయిన్ కు రుచించకపోవొచ్చని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News