Big Stories

President Joe Biden React: అమెరికా అధ్యక్షుడు బైడెన్ రియాక్ట్, ట్రంప్ విషయం.. సుప్రీంకోర్టు తీర్పు డేంజరంటూ..

President Joe Biden latest news(International news in telugu): అమెరికాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి అధ్యక్షుడి రేసులో డోనాల్డ్‌ట్రంప్ బరిలో ఉండంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. తాజాగా అక్కడి సుప్రీంకోర్టులో ఆయన భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణ నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందంటూ చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది.

- Advertisement -

వైట్‌హౌస్‌లో మాట్లాడిన అధ్యక్షుడు బైడెన్.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాసింత ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయస్థానం తీర్పు అత్యంత ప్రమాదకరమైనదిగా వర్ణించారాయన. అమెరికన్ ప్రజలు ట్రంప్‌కు మరోసారి అధ్యక్ష పీఠం అప్పగించాలని భావిస్తున్నారా? అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కోర్టు తీర్పుతో ట్రంప్ తనకు నచ్చిన పనులు చేయడానికి ముందుకు సాగుతారన్నారు. అన్ని విషయాలను తనకు అనుకూలంగా మార్చుకుంటారని, ఇది సొసైటీకి చాలా ప్రమాదకరమన్నారు. అతనికి ఎలాంటి పరిమితులు లేవంటూ వ్యాఖ్యలు చేరారు అధ్యక్షుడు జో బైడెన్.

- Advertisement -

నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందంటూ చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది అమెరికా సుప్రీంకోర్టు. మొత్తం ఆరుగురు న్యాయమూర్తులు ఈ తీర్పును సపోర్టు చేయగా, మరో ముగ్గురు వ్యతిరేకించారు. న్యాయస్థానం నిర్ణయంతో ట్రంప్‌ను మళ్లీ విచారించే అవకాశాలు ఇప్పట్లో లేవన్నమాట.

ఇంతకీ ట్రంప్ కేసులో డీటేల్స్‌లోకి వెళ్తే.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. పలుమార్లు న్యాయస్థానానికి హాజరయ్యారు. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజన విషయంలో అధ్యక్షుడికి ఉన్నట్లు మాజీలకు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

ALSO READ:  నాలుగేళ్ల తర్వాత సొంతదేశానికి పయనం.. అంతలోనే అనంతలోకాలకు..

అటు న్యాయస్థానం తీర్పుపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మన రాజ్యాంగానికి , ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయంగా వర్ణించారు. అమెరికన్ పౌరుడిగా తాను గర్విస్తున్నానని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఈ లెక్కన రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడు బైడెన్- మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటలయుద్ధం ముదిరిపాకాన పడడం ఖాయమన్నమాట.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News