Big Stories

Pakistan Milk Prices: పాకిస్తాన్‌ పౌరులకు మరో షాక్.. లీటరు పాల ధర రూ.370!

Pakistan Milk Prices: పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆ దేశ పౌరులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం పడింది. తాజాగా, ఆ దేశంలో కొత్త పన్నులు విధించింది. దీంతో పాల ధరలు మరిగిపోతున్నాయి.

- Advertisement -

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే పాల ధరలు పాకిస్తాన్‌లోనే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్ పాలపై ఆ దేశ ప్రభుత్వం 18 శాతం పన్ను విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా పెరిగాయి.

- Advertisement -

కొత్తగా పన్ను విధించడంతో ప్రస్తుతం పాల ధర రూ.370కు చేరింది. డాలర్ల ప్రకారం చూస్తే.. కరాచీలో లీటర్ పాల ధర 1.33 డాలర్లు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్యారిస్ లో 1.23 డాలర్లు, మెల్ బోర్న్ లో 1.08 డాలర్లు, అమ్ స్టర్ డామ్ లో 1.29 డాలర్లతో పోలిస్తే చాలా ఎక్కువ.

కొత్తగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పన్నులు విధించడంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.దీంతోపాటు ఆ దేశంలో ఉన్న చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

పాకిస్తాన్ ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని, ఇలాంటి తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇప్పటికే పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు ఈ పన్ను విధింపు భారం కానుంది.

అయితే బెయిలవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్తాన్ ఇటీవల బడ్జెట్ లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News