Big Stories

Congo Virus Pakistan: పాకిస్తాన్‌లో కాంగో వైరస్ కలకలం.. వణుకుతున్న దక్షిణాసియా దేశాలు..!

New Case of Congo Virus in Pakistan: పాకిస్తాన్‌లో కాంగో వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా, క్వెట్టాలో మరో కేసు నమోదైంది. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 32ఏళ్ల ఫాతిమా జిన్నాకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కాంగో వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కాంగో వైరస్ బారిన పడిన ఆమెను అదే ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

పెరుగుతున్న కేసులు..
పాకిస్తాన్‌లో కాంగో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. క్వెట్టాలో నమోదైన ఈ కేసుతో ఈ ఏడాది ఇప్పటివరకు 13 కాంగో వైరస్ కేసులు నయోదయ్యాయి. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ కేసులకు సంబంధించి వివరాలను ఓ మీడియా వెల్లడించింది. కాంగో వైరస్ బారిన పడిన ఫాతిమా..బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా పట్టణానికి చెందినవాసిగా గుర్తించారు.

- Advertisement -

గతంలో పెషావర్‌లో కాంగో వైరస్ బారిన పడిన 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మొదట కొన్ని లక్షణాలు కనిపించడంతో సదరు యువకుడిని ఓ ఆస్పత్రికి తరలించారు.తర్వాత లక్షణాలు ఎక్కువై మరణించాడు. దీంతో ఆ యువకుడితో పరిచయం ఉన్న అందరికీ పరీక్షలు నిర్వహించారు.

Also Read: America: అమెరికాలో పోటెత్తిన వరద.. తెగిన మిన్నెసోటా డ్యామ్‌

వైరస్ లక్షణాలు..
కాంగో..టిక్ బర్న్ నైరో వైరస్‌తో వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక జ్వరం, కండరాల నొప్పి, వాంతులు, తల తిరగడం, మెడ నొప్పి, వెన్ను నొప్పి, కంటి నొప్పి, ఫోటో ఫోబియా, వికారం, వాంతులు, అతిసారంచ కడుపు నొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. అదే విధంగా ఈ వైరస్ పశువులు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు తదితర జంతువులు నుంచి కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

పాకిస్తాన్‌లో కాంగో వైరస్ వ్యాప్తి పెరగడంతో దక్షిణాసియా దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా సమీపంలో ఉన్న భూటాన్, భారత్, నేపాల్‌తో పాటు మాల్దీవులు, బంగ్లాదశ్, శ్రీలంక దేశాలు అప్రమత్తమయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News