Big Stories

Nepal government in crisis: నేపాల్ ప్రధాని ప్రచండకు ఝలక్..మారనున్న ప్రభుత్వం!

Nepal government in crisis again: నేపాల్‌ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆ దేశ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని ప్రచండ తీరుపై అసంతృప్తితో ఉన్న సీపీఎన్, యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి.. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బాతో జట్ట కట్టారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

- Advertisement -

ప్రస్తుత ప్రధాని ప్రచండ నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు ఓలి, బహదూర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం సైతం కుదిరింది.

- Advertisement -

ఈ ఒప్పందం ప్రకారం.. రోటేషన్ పద్ధతిలో ప్రధాని పదవిని ఇరు పార్టీలు పంచుకునేలా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే తన ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రచండ వెల్లడించారు. ఇందులో భాగంగానే రాజీనామా చేయడం కంటే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొటానని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన వెల్లడించారు.

రాజ్యాంగం ప్రకారం..ప్రధాని పార్లమెంటు విశ్వాసాన్ని పొందడానికి 30 రోజుల గడువు ఉంటుంది. అయితే గతంలో అధికారంలో ఉన్న ప్రచండ.. ఇప్పటికే మూడు సార్లు విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే. ప్రచండ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సీపీఎన్, యూఎంఎల్ ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది సమర్పించిన బడ్జెట్‌పై ఓలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రచండ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానని సవరించాలని ఓలి, దేవ్ బా నిర్ణయించుకున్నారు.

రానున్న మూడేళ్లకు గానూ రొటేషన్ పద్ధతిపై ప్రధాని పదవి చేపట్టేలా నిర్ణయించుకున్నారు. అయితే మొత్తం నేపాల్ పార్లమెంట్‌లో 275 సీట్లు ఉన్నాయి. ఇందులో దేవ్ బా నేపాల్ కాంగ్రెస్..89 సీట్లు, ఓలి పార్టీకి వచ్చిన 78 సీట్లు కలిపితే 167 సీట్లతో మెజార్టీ లభిస్తుంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News