Big Stories

Sanctions On Russia : అత్యధిక ఆంక్షలు రష్యాపైనే!

Sanctions On Russia : ప్రపంచంలో అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం రష్యా. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాలో వ్యక్తులు లేదా సంస్థలపై ప్రస్తుతం మొత్తం 16,077 ఆంక్షలు ఉన్నాయి. 22 ఫిబ్రవరి 2022న దాడులకు ముందు నాటితో పోలిస్తే వీటి సంఖ్య దాదాపు ఆరు రెట్లు.

- Advertisement -

ఉక్రెయిన్‌పై పుతిన్ దురాక్రమణ చర్యల ఫలితంగా రష్యాను అతి పెద్ద శత్రువుగా అమెరికా పరిగణిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయకముందు ఇరాన్ అత్యధిక సంఖ్యలో ఆంక్షలను చవిచూసింది. ఆ దేశంపై ప్రస్తుతం 4953 ఆంక్షలున్నాయి. అమెరికాతో పాటు ఈయూ, ఆస్ట్రేలియా, కెనడా, భారత్, ఇజ్రాయెల్ తదితర దేశాలు వీటిని విధించాయి.

- Advertisement -

ఆంక్షల విషయంలో సిరియా మూడోస్థానంలో నిలిచింది. 2011లో ఆ దేశంలో అంతర్యుద్ధం తలెత్తిన దరిమిలా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ దేశంపై 2811 ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఇక సిరియా 2,811 ఆంక్షలను ఎదుర్కొంటుండగా.. ఉత్తర కొరియాపై 2171, బెలారస్ 1454, మయన్మార్ 988, వెనెజువెలాపై 747 ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంక్షల కారణంగా రష్యా మార్కెట్ నుంచి దాదాపు వెయ్యి కంపెనీలు తప్పుకున్నాయి. అడిడాస్, గూగుల్, డిస్నీ, ఫోక్స్‌వాగన్ వంటి దిగ్గజ సంస్థలు వాటిలో ఉన్నాయి.

అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించిన దేశాలపై ఇతర దేశాలు ఆంక్షల రూపంలో కఠిన చర్యలు తీసుకుంటాయి. రష్యా విషయమే తీసుకుంటే.. తమ తమ దేశాల్లో ఉన్న రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపచేశాయి. ఆర్థిక లావాదేవీలు ఏవీ జరపకుండా.. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ స్విఫ్ట్ నుంచి రష్యా ప్రధాన బ్యాంక్‌లను తొలగించడం ఈ చర్యల్లో మరొకటి.

అలాగే చమురు, బొగ్గు ఎగుమతుల ద్వారా రష్యాకు ఆదాయం పొందుతోంది. దానికి కత్తెర వేస్తూ.. ఇంధన దిగుమతులను కొన్ని దేశాలు నిలిపివేశాయి. అలాగే రష్యాకు 200 రకాల వస్తువుల ఎగుమతులను ఆపివేయడం కూడా ఆంక్షల్లో భాగమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News