Big Stories

Maldives President Muizzu: మాల్దీవులు అధ్యక్షుడిపై క్షుద్రపూజలు.. ఇద్దరి అరెస్ట్!

Black Magic on President Muizzu: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై ‘బ్లాక్ మ్యాజిక్’ చేశారనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చేతబడి చేశారనే ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

మొయిజ్జుపై క్షుద్ర విద్యలు ప్రయోగించిన మంత్రుల్లో ఒకరైన మహిళా మంత్రిని మాలె పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ, వాతావరణ మార్పు, ఇంధన శాఖల మంత్రి శాతీమాత్ షామ్నాజ్ అలీ సలీంతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో మంత్రి మాజీ భర్త అయిన అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌లతోపాటు మరొకరిని గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీంతోపాటు మరో ఇద్దరిని వారం రోజుల కస్టడీకి అప్పగించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే షమ్నాజ్ సలీంను పర్యావరణశాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈమెతోపాటు ఈ ‘బ్లాక్ మ్యాజిక్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న రమీజ్‌ను సైతం మంత్రి పదవి నుంచి తప్పించారని తెలుస్తోంది.

ప్రస్తుతం మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. గతంలో సిటీ మేయర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం నుంచి కానీ అధ్యక్షుడి కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎటువవటి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

షమ్నాజ్ అరెస్ట్ చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. కేవలం అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై మంత్రి షమ్నాజ్ క్షుద్ర విద్యలు ప్రదర్శించినట్లు వార్తలు మాత్రమే వెలువడ్డాయి. ఈ వార్తలపై పోలీసు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న మాల్దీవులలో క్షుద్ర విద్యలు నేరం కాదు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం.. ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.

Also Read: పాక్ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా తీర్మానం.. ఎందుకంటే ?

ఈ దేశంలో సంప్రదాయాలను విశేషంగా ఆదరిస్తారు. ఇలాంటి పరిణామాలను ఎక్కువగా నమ్ముతారని ఆ దేశ ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ‘బ్లాక్ మ్యాజిక్’ వంటి ఆరోపణలు అధికారులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటువంటి కేసుల్లో జరిగిందని ఎలాంటి ఆధారాలు చూపించడంలో విఫలమైనట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News