Big Stories

Kenya: చుక్కలు చూపిస్తున్న కాకులు.. తట్టుకోలేకపోతున్న జనాలు.. చివరకు..

Kenya decides to get rid of crows: ఊళ్లలో లేదా చెట్లపైన కాకులు కనిపిస్తుంటాయి.. కావ్ కావ్ అని అరుస్తుంటాయి. అప్పుడప్పుడు అవి మన ఇంట్లోకి కూడా వస్తుంటాయి. పెంపుడు జంతువుల మాదిరిగా వ్యవహరిస్తుంటాయి. ఏదైనా తినే గింజలు, వస్తువులు కనబడితే చాలు టక్కున వచ్చి వాటిని నోట్లో పెట్టుకుని బుర్రుమంటూ వెళ్లిపోతాయి. కాకులను మన దేశంలో శుభసూచకంగా పరిగణిస్తుంటారు. ఇంటికి అతిథులు వచ్చే ముందు కాకి వచ్చి అరుస్తుందని చెబుతుంటారు.

- Advertisement -

కాకులు మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కేవలం ఒక అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో కాకులు ఉన్నాయి. ముఖ్యంగా యూరప్, ఆసియా, అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో కాకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, సోమాలియ వంటి తూర్పు తీర దేశాల్లో మాత్రం కాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాటివల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది పూర్తయ్యేవరకు దాదాపు 10 లక్షల కాకులను అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.

- Advertisement -

కెన్యాలో కాకుల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. టూరిస్టుల ప్లేట్లలోనుంచి ఫుడ్ ను అవి ఎత్తుకెళ్తున్నాయి. చెట్లపై ఉండే పండ్లను మిగలనివ్వడంలేదు. పంటలపై దాడులు చేస్తున్నాయి. అంతేకాదు.. స్థానికంగా ఉండే పక్షిజాతులను కూడా తరిమేస్తున్నాయి. పౌల్ట్రీ, గుడ్డు లాంటి పశుజీవిన విధానంపై కూడా అవి దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం.. తమ దేశంలో కాకుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

ఒక స్టడీ ప్రకారం.. టాంజానియాకు సమీపంలో ఉన్న జంజిబార్ అనే ప్రాంతంలో మొత్తం మొక్కజొన్న ఉత్పత్తిలో 12.5 శాతం కాకుల వల్లే నష్టోయినట్లు అందులో పేర్కొన్నారు. ఇలా కెన్యా ప్రజలు కాకులతో విసిగిపోయి బహిరంగంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాటి వల్ల ఇబ్బందులే కాదు.. వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయంటూ మండిపడుతున్నారు. జనాల నుంచి నిరసనలు భారీగా వస్తుండడంతో వాటిని అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కెన్యా ప్రభుత్వం తెలిపింది.

Also Read: అమెరికాలో వరద బీభత్సం.. డకోటాలో ఎమర్జెన్సీ

అయితే, కెన్యా ప్రభుత్వం ఇలా కాకులను నియంత్రించాలని అనుకోవడం ఇది మొదటిసారేంకాదు. గత రెండు దశాబ్దాల క్రితమే వాటిని అంతం చేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో అక్కడ కాకుల సంఖ్య తగ్గినప్పటికీ.. క్రమంగా వాటికి అనుకూల వాతావరణం ఏర్పడడం వల్ల కాలక్రమేణా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News