Big Stories

Wikileaks founder Julian Assange free: వికీలీక్స్ ఫౌండర్ జులియన్ బిగ్ రిలీఫ్.. యూకె జైలు నుంచి విడుదల..!

Wikileaks founder Julian Assange Free: ఎట్టకేలకు వికీలీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజేకు స్వేచ్ఛ లభించింది. లండన్‌లోని బెల్‌మార్ష్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ముఖ్యంగా అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్టు నేరం అంగీకరించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయనకు ఫ్రీడమ్ వచ్చింది.

- Advertisement -

లండన్ నుంచి నేరుగా విమానంలో సొంతదేశం ఆస్ట్రేలియా వెళ్లాడు. జైలు నుంచి విడుదల విషయాన్ని జులియన్ అసాంజే X లో పోస్టు చేశాడు. తాను ఇప్పుడు స్వేచ్చా జీవని, లండన్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందని తెలిపాడు. జూన్ 24 ఉదయం విడుదలైనట్టు చెప్పుకొచ్చాడు. బెల్‌మార్ష్ జైలులో 1901 రోజులు గడిపారాయన.

- Advertisement -

తన విడుదలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నప్పటికీ, దానికి సంబంధించిన డీటేల్స్ అధికారికంగా ఫైనల్ కాలేదని వెల్లడించాడు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానన్నాడు. అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంలో బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకుంది.

Also Read: Kenya Protests: చిచ్చురేపిన కొత్త ఆర్థిక బిల్లు.. కెన్యా పార్లమెంటు భవనానికి నిప్పు
ఇంతకీ అసాంజే మీద కేసు ఏంటి..?

14 ఏళ్ల కిందట అమెరికా రక్షణ విభాగానికి చెందిన సీక్రెట్ విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్‌పై జరిగిన వైమానిక దాడుల వ్యవహారం కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ ఎనలిస్టు చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 35 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇక 2019లో డోనాల్డ్ ట్రంప్ హయాంలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూడచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం.

అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో యూకెలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందాడు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఆ తర్వాత బ్రిటన్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. అసాంజేను తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నం చేసింది. అంతేకాదు ఆయనపై మోపిన అభియోగాలు నిజమని తేలితే ఏకంగా 175 ఏళ్లు జైలు శిక్ష పడేది. కాకపోతే ఆస్ట్రేలియా రిక్వెస్ట్‌తో ఒత్తిళ్లకు తలొగ్గిన బైడెన్ సర్కార్, అసాంజే విడుదలకు మార్గం సుగమం చేసింది.

Also Read: సౌత్‌కొరియాలో విషాదం, లిథియం బ్యాటరీ కంపెనీలో పేలుడు, 22 మంది మృతి

వికీలీక్స్ పేరు చెప్పగానే పలు దేశాల నేతలు వణికిపోయారు. ఈయన బయటపెట్టిన పత్రాలతో చాలా మంది అవినీతి నేతలు తమ పదవులు కోల్పోయారు. 14 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా వికీలీక్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. ఇదే దూకుడు కంటిన్యూ చేసి అడ్డంగా దొరికిపోయాడు అసాంజే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News