Big Stories

Biden Reacts about his Debate Performance: అవును.. నేను యువకుడిని కాదని నాకు తెలుసు.. కానీ,.. : జోబైడెన్

Joe biden reacts about his debate performance with trump: అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల వేళ అక్కడ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే, ఇదే క్రమంలో నేతల మధ్య విమర్శలు.. ప్రతివర్శలూ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం గురించి కొద్ది రోజుల నుంచి పలు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు జోబైడెన్ వాటిని ఖండిస్తూ కొట్టిపారేస్తూ వచ్చారు. కాగా, ఇటీవల జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదం వరల్డ్ వైడ్ గా ఆసక్తిని రేపింది. ఈ చర్చ సమయంలో జో బైడెన్ తడబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీలో ఆందోళన కలుగుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనంటూ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తమ ఆవేదనను బహిరంగపరచకుండా బైడెన్ ను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు పార్టీ అభ్యర్థిని మార్చడం అంటే కష్టం. జోబైడెన్ సహకరిస్తే తప్ప అది సాధ్యం కాదంటూ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ అభ్యర్థిని మార్చాల్సి వస్తే పార్టీ నిబంధనలు కూడా మార్చాల్సి వస్తుంది. ఈ క్రమంలో బైడెన్ తడబాటు వల్ల పార్టీ అపజయాన్ని చవిచూడాల్సి వస్తుందా ? అంటూ చర్చిస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై జోబైడెన్ స్పందించారు. ‘అవును.. నేను యువకుడిని కాదని నాకు తెలుసు. అందువల్ల నేను గతంలో మాదిరిగా చలాకీగా ఉండలేను. అప్పటిలాగా స్పష్టంగా మాట్లాడలేను.. చర్చించలేకపోవొచ్చు. కానీ, నిజం ఎలా చెప్పాలో నాకు చాలా బాగా తెలుసు. నా పనిని సక్రమంగా ఎలా చేయాలో నాకు తెలుసు. ఎవరైనా కిందపడితే మళ్లీ వాళ్లు పైకి లేస్తారు. అధ్యక్ష పదవిని నేను నిర్వర్తించగలనని బలంగా నమ్మాను కాబట్టే మళ్లీ బరిలో ఉన్నాను’ అంటూ శుక్రవారం బదులిచ్చారు. నార్త్ కరోలినాలో జరిగిన ఓ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘డిబేట్ లో నేను తడబడిన మాట వాస్తవమే. కానీ, తడబడినంత మాత్రానా అధ్యక్ష పదవి బాధ్యతలు నిర్వర్తించలేమా..? ట్రంప్ గెలిస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తారు. కానీ, నేను దానిని పరిరక్షిస్తాను. ఈ ఒక్క అంశమే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తుంది’ అంటూ జోబైడెన్ తన పార్టీ నేతలతో పేర్కొన్నారు.

ఈ క్రమంలో బైడెన్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అండగా నిలిచారు. ‘సాధారణ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి.. బైడెన్ కు, తన గురించి మాత్రమే పట్టించుకునే వ్యక్తి.. ట్రంప్ కు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరు నిజం చెప్పే వ్యక్తి, మరొకరు అబద్ధాలు చెప్పే వ్యక్తి.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి. ఒక్క డిబేట్ లో సరిగా మాట్లాడనంత మాత్రానా ఎన్నికల ఫలితాలు మారబోవు’ అంటూ బైడెన్ కు మద్దతుగా నిలిచారు ఒబామా.

అయితే, చర్చలో డొనాల్డ్ ట్రంపే పైచేయి సాధించారంటూ సీఎన్ఎన్ పోల్ లో మెజారిటీ వీక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు అభిప్రాయపడ్డారు. కానీ, ఆ డిబేట్ ను చివరకు హుందాగా ముగించారంటూ అందులో పేర్కొన్నారు.

Also Read: వారెన్ బఫెట్ కొత్త నిర్ణయం, వీలునామాలో సవరణ..

ఈ డిబేట్ లో పైచేయి సాధించిన ఉత్సాహంతో ఉన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్లకు బైడెన్ మించిన ఛాయిస్ మరొకటి ఉండబోదంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలోనే అసమర్థ అధ్యక్షుడిగా జోబైడెన్ నిలిచిపోతారంటూ ట్రంప్ విమర్శించారు. వర్జీనియాలోని చెసపీక్ లో తన మద్దతుదారులతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘డిబేట్ లో 90 నిమిషాలపాటు నిలకడగా లేని జో బైడెన్ ను మళ్లీ నాలుగేళ్లపాటు వైట్ హౌస్ లో కూర్చోపెడితే అమెరికా మనుగడ సాగించగలదా..? ఈ అంశాన్ని ఓటర్లు ఆలోచించాలి’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కాకుండా కమలా హ్యారిస్ ను అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపితే తానెంతో సంతోషిస్తానన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News