Big Stories

Israeli Attacks on Rafah: వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, రఫాపై దాడి.. 45 మంది మృతి

Israeli Attacks on Rafah: అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తోంది. అయినా ఏ మాత్రం ఆ దేశం వెనక్కి తగ్గలేదు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తోంది. తాజాగా దక్షిణ గాజాలో ముఖ్య సిటీ రఫాపై దాడులు చేసింది. ఈ దాడిలో దాదాపు 45 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

పాలస్తీనియన్ల శరణార్ధి శిబిరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ దళాలు. మరో 25 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దాడులతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. రఫాలోని ఓ ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఇప్పటివరకు 30 మృతదేహాలను తీసుకొచ్చారని తెలిపాయి. గాజాకు శుక్రవారం క్రూరమైన రోజుగా వర్ణించాయి.

- Advertisement -

ఇజ్రాయెల్ బాంబు దాడులపై గాజా నోరు విప్పింది. రెండు ప్రదేశాల్లో బాంబు దాడుల తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పింది. మువాసి పరిధిలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో పాలస్తీనియన్ల రక్ష శిబిరాలు ఉన్నాయని తెలిపింది. బాధితులు భారీగా ఉండవచ్చని అంచనా వేస్తోంది. తమ దేశ పౌరుల మరణాలకు ఈ దాడులే కారణమని ఆరోపించింది.

ALSO READ: దక్షిణ కొరియాకు పుతిన్ వార్నింగ్ !

గాజా ప్రభుత్వ ప్రతినిధుల వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ఖండించింది. ఉగ్రవాదులు ప్రజల మధ్య ఉన్నారని, అందుకే ఈ దాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తున్నారని తెలిపింది. ఇదికాకుండా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైనికులు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News