Big Stories

Sunita Williams Dances at ISS: అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. ఆనందంతో డ్యాన్స్.. వీడియో వైరల్!

Sunita Williams Dances at Space Station: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తన సిబ్బందితో కలిసి గురువారం అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు. అంతరిక్షంలోకి చేరకోగానే సునీతా ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఆమె డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించి వీడియోలో వైరల్ అయ్యింది. అంతరిక్షంలో మరో ఏడుగురు వ్యోమగాములకు హగ్ ఇచ్చారామె.

- Advertisement -

అంతరిక్ష నౌకను పైలట్ చేసిన మొదటి మహిళగా సునీతా చరిత్ర సృష్టించారు. 59ఏళ్ల సునీతా విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లడం ఇది మూడోసారి కావడం గమనార్హం. బుధవారం ఉదయం ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ స్పేస్ స్టేషన్ నుంచి నాసా ప్రయోగించిన అట్లాస్ వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో సునీతా విలియమ్స్‌తోపాటు అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు అక్కడికి చేరుకున్నారు.

- Advertisement -

రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైంది. బోయింగ్ సంస్థ రెడీ చేసిన ఈ క్యాప్సూల్‌కు ఇది తొలి యాత్ర. అయితే ఆ సమయంలో హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలో ఇబ్బందులు తలెత్తాయి. అందులోని హీలియం నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఐఎస్ఎస్‌తో అనుసంధానం అయ్యింది.

Also Read: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27మంది మృతి

2002లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, ఆ తర్వాత 2006 లోనూ మరోసారి వెళ్లారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కడ అడుగుపెట్టారు. 1987లో సునీతా విలియమ్స్, యూఎస్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. 11 ఏళ్ల తర్వాత నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. సునీతా అంతరిక్షంలోకి అడుగుపెట్టినప్పటికీ దైవాన్ని బాగా నమ్ముతారు ఆమె. అందుకే అంతరిక్షానికి వెళ్లిన ప్రతీసారి తన ఇష్టదైవం గణేషుడి ప్రతిమ, భగవద్గీతను తీసుకెళ్లారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News