Big Stories

Indian-American Rs 8,300 Crore Fraud: బుక్కైన ఇండో అమెరికన్ వ్యాపారవేత్త రిషి షా, ఏడున్నరేళ్ల జైలు

Indian-American Rs 8,300 Crore Fraud: ఇండో అమెరికన్ బిజినెస్‌మేన్ రిషి షా అడ్డంగా దొరికి పోయాడు. చేసిన తప్పును న్యాయస్థానంలో అంగీకరించాడు. దీంతో అతడికి కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన చేసిన పనేంటో తెలుసా? అమెరికా చరిత్రలో అతి పెద్ద కార్పొరేట్ నేరానికి పాల్పడ్డాడు.

- Advertisement -

ఇండో అమెరికన్ బిజినెస్‌మేన్ పేరు రిషి షా. తక్కువ సమయంలో అమెరికా అంతా పాపులర్ అయ్యాడు. ఆయన వయస్సు కేవలం 37 ఏళ్లు. ఆయన ఆలోచనలు అనంతం. దాన్ని పెట్టుబడిగా మార్చుకున్నాడు. తక్కువ సమయంలో ఔట్‌కమ్ హెల్త్ అనే కంపెనీని ప్రారంభించాడు. దీనికి సీఈఓగా అయిపోయాడు.

- Advertisement -

తన ప్రకటనలతో ఇన్వెష్టర్లు ఆకట్టుకున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటుపడ్డాడు. ఫలితం కంపెనీ లోగుట్టు బయటపడింది. అడ్డంగా దొరికిపోయాడు. న్యాయస్థానం ఆయనకు ఏడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించింది. ఇంతకీ ఇతగాడు చేసిన వ్యాపారం ఏంటో తెలుసా? ఇంకా లోతుల్లోకి వెళ్లొద్దాం.

యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కాంటెక్ట్స్ మీడియా హెల్త్ పేరిట ఓ కంపెనీని నిర్మించాడు రిషి షా. ఆ కంపెనీ ఉద్దేశం కేవలం హెల్త్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది లక్ష్యం. దాన్ని వినూత్నంగా ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దాన్ని ఔట్ కమ్ హెల్త్ కంపెనీగా మార్చే శాడు. రిషి ఇన్నోవేషన్ బాగుండడంతో శ్రద్ధా అగర్వాల్ ఆ కంపెనీలో భాగస్వామిగా మారింది. దీంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందులో పెట్టుబడులు పెట్టాయి. దీంతో రిషి బిలియన్ అయిపోయాడు.

ఏం జరిగిందో తెలీదుగానీ షా బిజినెస్ క్రమక్రమంగా దెబ్బతినడం మొదలుపెట్టింది. దీన్ని నుంచి తేరుకునేందుకు రిషి షా, మరో పార్టనర్ శ్రద్ధా అగర్వాల్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్టీలు ఇన్వెస్టర్లను మోసం చేయడం మొదలుపెట్టారు. దొంగ లెక్కలతో ఎక్కువగా రిటర్న్స్ వచ్చినట్టు మభ్యపెట్టారు. కంపెనీ సామర్థ్యం కన్నా ఎక్కువ బిజినెస్ అయినట్టు క్రియేట్ చేశారు. దీంతో ఫార్మా కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించారు.

కంపెనీని గాడిలో పెట్టాల్సిందిపోయి జల్సాలకు అలవాడుపడ్డాడు రిషి షా. ప్రైవేటు జెట్ విమానాలు, లగ్జరీ షిష్‌ల్లో విదేశీ టూర్లు వెళ్లడం, వేల కోట్లతో ఇల్లు కొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల విలువ నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది. 2017లో షా మోసాలు క్రమంగా బయటకు రావడంతో పతనం మొదలైంది. బడా కార్పొరేట్ కంపెనీలు రిషి షా, అగర్వాల్‌పై కోర్టులో కేసులు వేశారు.

ALSO READ: అమెరికా అధ్యక్షుడు బైడెన్ రియాక్ట్, ట్రంప్ విషయం.. సుప్రీంకోర్టు తీర్పు డేంజరంటూ..

సుదీర్ఘ విచారణ తర్వాత గతేడాది న్యాయస్థానం వాళ్లని దోషులుగా తేల్చింది. చేసిన నేరాన్ని న్యాయస్థానం లో అంగీకరిస్తూ పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పాడు రిషి షా. చివరకు న్యాయస్థానం షాకు ఏడున్నరేళ్లు, అగర్వాల్‌కు మూడేళ్లు, ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాల్లో ఇది కూడా ఒకటి. భారతీయ కరెన్సీలో లెక్కకడితే దాదాపు 8,300 కోట్ల రూపాయలన్నమాట.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News