Big Stories

Hurricane Beryl Intensified: కరేబియన్ దీవులను వణికించిన.. బెరిల్ హరికేన్..

Hurricane Beryl live updates(International news in telugu): అమెరికాలో బెరిల్ హరికేన్ మంగళవారం భీభత్సం సృష్టిసంచింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులతో వీయడంతో చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం, ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ బెరిల్ హరికేన్ ఇదేనని అక్కడి అధికారులు వెల్లడించారు. బార్బిడోసియాతో పాటు సైయింట్ లూసియా, గ్రెనడా వంటి ప్రాంతాలపై ఎక్కువగా బెరిల్ హరికేన్ పంజా విసరడంతో పూర్తిగా ఇళ్లు ధ్వసం అయ్యాయి.  కరేబియన్ ద్వీపకల్పంలో ఒక్కటైన ఐలాండ్ అనే ప్రాంతంలో దాదాపు 3000 వేల గృహాలు ఉన్నాయి. బెరిల్ హరికేన్ భీభత్సం సృష్టించడంతో సుమారు ఆ ప్రాంతం అంతా కనుమరుగైందనే చెప్పాలి. తుఫాను ప్రభావంతో ఈ దీవిలో కనీసం 6మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వృక్షాలు నేలకూరాయి.

- Advertisement -

బార్బిడోస్ లోని బ్రిడ్జిటౌన్ లు అక్కడ ప్రాంతాలు జలమయమయ్యాయి. సెయింట్ విన్సెంట్ లోని భీకరమైన గాలులతో ఇళ్ల పైకప్పులు ఎగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ద్వీపాలలోని రెస్క్యూ సిబ్బంది గ్రెనడాలోని కారియాకౌ ద్వీపంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. తుఫాను ప్రభావంతో జమైకాలోని కింగ్‌స్టన్‌కు తూర్పు-ఆగ్నేయంగా 480 కి.మీ. గంటకు 240 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గంటకు 35 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫానులో చిక్కుకున్న అనేక ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

Also Read: అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి, రేసు నుంచి తప్పుకోవాలంటూ పార్టీలో..

తుఫాను ప్రభావంతో తీవ్రమైన నష్టం జరిగింది. ఇది మళ్లీ పునర్‌నిర్మాణానికి ఎక్కువ డాలర్లు ఖర్చు అయ్యే అవకాసం ఉందని పూర్తిగా మళ్లీ యథావిదిస్థానానికి తీసుకురావాలంటే ఏడాది కాలం పడుతుందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది.

ఇదిలా ఉంటే.. అక్కడ భీకర బార్బడోస్ తుఫానులో చిక్కుకుపోయిన టీమ్ ఇండియాను  తీసుకువచ్చేందుకు బీసీసీఐ స్పెషల్ ఫ్లయిట్ ను పంపించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News