Big Stories

Hinduja family members sentenced: అడ్డంగా దొరికిన హిందుజా ఫ్యామిలీ, ఇంటి సేవకుల వేతనాలు, నాలుగున్నరేళ్ల జైలు

Hinduja family members sentenced: భారత సంతతికి చెందిన హిందుజా ఫ్యామిలీలో నలుగురికి నాలుగున్నర ఏళ్ల జైలు శిక్ష విధించిన స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు. ఇంటిలో పనిచేసిన వారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతోపాటు వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు డీటేల్స్‌లోకి వెళ్తే..

- Advertisement -

స్విట్జర్లాండ్‌‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో భారత సంతతి హిందుజా ఫ్యామిలీ ఒకటి. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకెళ్లి జెనీవాలోని విలాసవంతమైన తమ ఇళ్లలో సేవకులుగా వారిని నియమించు కున్నారు. అంతేకాదు వారి పాస్ట్‌పోర్టు సైతం హిందుజా ఫ్యామిలీ తీసుకున్నారు. పనివాళ్లకు ఇంట్లో వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయాల్లో చెల్లించారు.

- Advertisement -

వర్కర్లు చేతికి జీతం ఇవ్వకుండా భారత్‌లో వారి ఫ్యామిలీ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంతేకాదు వాళ్లతో రోజుకు 18 గంటలపాటు పని చేయించుకోవడం మరో ముఖ్యకారణం. కనీసం పనివాళ్లు విల్లా వదిలి వెళ్లటానికి అనుమతించకపోవడం వంటి అభియోగాలను మోపింది. స్విట్జర్లాండ్ చట్టాలను ముమ్మాటికీ ఉల్లఘించడమేనని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

దీనిపై స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వీరికి నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. వారిలో ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్, కొడుకు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు. అయితే న్యాయస్థానం తీర్పు వెల్లడించిన సమయంలో వారి తరపున మేనేజర్ హాజరయ్యారు.

ALSO READ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన..గ్రాడ్యుయేట్ పూర్తయిన వెంటనే గ్రీన్ కార్డు!

న్యాయస్థానం తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని హిందుజా తరపు న్యాయవాది తెలిపారు. 2007లోనూ ఈ తరహా నేరాలకు న్యాయస్థానం వారిని దోషిగా తేల్చింది. 2000 ఏడాదిలో స్విస్ పౌరసత్వాన్ని పొందింది ఈ ఫ్యామిలీ. ఫోర్బ్స్ మేగిజైన్‌ అయితే వీరి ఆస్తులను 20 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. హిందుజా ముగ్గురు సోదరులు ఐటీ, మీడియా, విద్యుత్, రియల్ఎస్టేట్, హెల్త్ సెక్టార్‌లో వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వారి దగ్గరున్న ఆభరణాలకు ట్యాక్స్‌లకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News