Big Stories

China: చైనాలో పెను ప్రమాదం.. 47 మంది మృతి

Heavy Rains in China: పెను ప్రమాదం కారణంగా చైనాలో 47 మంది మృత్యువాతపడ్డారు. లెక్కకుమించినంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటూ అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తంగా అక్కడ పరిస్థితి ఎటు చూసినా అంతా విలయతాండవంగా మారింది. భారీగా విరిగిపడిన చెట్లు, కొండచరియలు, కూలిపోయిన ఇండ్లు.. పొంగిపొర్లుతున్న భారీ వరద నీరే కనిపిస్తున్నది. ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పలు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతం విలవిలలాడిపోతుంది. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతూ పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద నీరు పొంగిపొర్లుతుండడంతో వందలాది ఇండ్లు నీటమునిగాయి. అయితే, కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దక్షిణ చైనాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని తెలిపింది చైనా ప్రభుత్వం. భారీ వరదల కారణంగా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో శిథిలాల కిందే పలువురు చిక్కుకుపోయి ఉన్నట్లు తెలుస్తోంది. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.

- Advertisement -

Also Read: అడ్డంగా దొరికిన హిందుజా ఫ్యామిలీ, ఇంటి సేవకుల వేతనాలు, నాలుగున్నరేళ్ల జైలు

వరదల కారణంగా ఇప్పటివరకు 47 మంది మృతిచెందారని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. లెక్కకు మించినంత మంది గాయపడి ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదంటూ పేర్కొన్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News