Big Stories

Pannun murder plot case: పన్నూ హత్య కుట్ర కేసు, భారతీయుడు నిఖిల్‌గుప్తాను కోర్టులో..

Pannun murder plot case: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్య కుట్ర కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన భారతీయుడు నిఖిల్‌గుప్తాను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు సిద్ధమైంది అమెరికా.

- Advertisement -

సోమవారం ఆయన్ని న్యూయార్క్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో పన్నూ హత్యకు కుట్ర జరిగిందని తాము దాన్ని భగ్నం చేశామని అమెరికా గతంలో వెల్లడించింది. ముఖ్యంగా భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా ఓ వ్యక్తి 15వేల అమెరికా డాలర్లు సుపారీగా ఇచ్చినట్టు అమెరికా అడ్వకేట్ అభియోగం మోపారు.

- Advertisement -

అగ్రరాజ్యం సూచనలతో తాము అరెస్టు చేసినట్టు చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. వ్యాపారాల నిమిత్తం 52 ఏళ్ల గుప్తా, గతేడాది జూన్‌లో పరాగ్వే వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆయన్ని చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్భంద కేంద్రంలో ఆయన ఉన్నారు. అమెరికాకు అప్పగించడం కోసమే ఆయన్ని అక్కడ ఖైదీగా ఉంచినట్టు వెల్లడించింది. సోమవారం ఫెడరల్ న్యాయస్థానంలో ఆయన్ని హాజరుపరచనున్నట్లు సమాచారం.

ALSO READ: భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో

పన్నూ కుట్ర కేసులో తమ పాత్ర ఏమీలేదని ఇప్పటికే భారత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ కుట్రతో తనకు ఎలాంటి సంబంధం లేదని గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుండగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెక్ సలీవన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో సలీవన్.. ఎన్ఐఏ చీఫ్ అజిత్ దోవల్‌తో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో గుప్తా వ్యవహారం ప్రస్తావనకు రావచ్చని వార్తలు వస్తున్నాయి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News