Big Stories

France Elections: ఫ్రాన్స్‌లో ఎన్నికల తొలి విడత పూర్తి.. మెక్రాన్‌కు ఓటమి ఖాయమా?

France Elections First round of polling: ఫ్రాన్స్‌లో పార్లమెంట్ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. ఈ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. మలి విడత పోలింగ్ ఈనెల 7న జరగనుంది. తొలి విడత పోలింగ్‌లో 69 శాతం ఓట్లు పోలయ్యాయి. 2022 ఎన్నికలతో పోల్చితే 22శాతం ఓటింగ్ పెరిగింది. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు ఉండగా.. పార్లమెంట్‌కు 577 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు.

- Advertisement -

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమి, అతి మితవాద నేషనల్ ర్యాలీ, న్యే పాపులర్ ఫ్రంట్‌ల మధ్య హోరాహూరీగా కనిపిస్తోంది. అయితే ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మెక్రాన్ నేతృత్వంలోని రినైజాన్స్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మేరి లీపెన్ నాయకత్వంలోని అతి మితవాద పార్టీ నేషనల్ ర్యాలీ బాగా పుంజుకోవడంతో మెక్రాన్ పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

- Advertisement -

తొలి రౌండ్ పోలింగ్‌ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ మెక్రాన్‌ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి భయం మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫలితాల్లో మెరైన్ లే పెన్‌కు చెందిన నేషనల్ ర్యాలీకి అనుకూలంగా వచ్చాయి. ఈ పార్టీకి 34 శాతం ఓటింగ్ తో గెలుస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి.

Also Read: టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 60 మందికిపైగా..

అలాగే మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20 నుంచి 23 శాతం ఓటింగ్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అదే విధంగా న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. ఈ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెక్రాన్ ఓటమి ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈనెల 7న మలి విడత జరగనున్న నేపథ్యంలో గెలుపోటములపై అంచనా కష్టమే. పూర్తి స్థాయి ఫలితం రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News