Big Stories

Elon Musk’s contracted to destroy retired ISS: టైమ్ ఓవర్,అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేతకు ఎలాన్ మస్క్‌

Elon Musk’s contracted to destroy retired ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్ఎస్‌ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యాడు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్‌మస్క్‌. దీనికి సంబందించి నాసా.. స్పేస్ ఎక్స్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ అక్షరాలా 843 మిలియన్ డాలర్లు… అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలన్నమాట.

- Advertisement -

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర-ఐఎస్ఎస్ కాలపరిమితి మరో ఆరేళ్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలో నాసా
ఎలాన్‌మక్స్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సముద్రంలో కూల్చివేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మస్క్ సంస్థతో డీల్‌ కుదిరింది. ఇందుకోసం ఓ వ్యోమనౌకను నిర్మించనున్నారాయన. ఐఎస్ఎస్ ను అనేక భాగాలుగా విడదీసి తర్వాత కక్ష్యను క్రమంగా తగ్గించి చివరకు శకలాలు సముద్రంలో వేసే విధంగా స్కెచ్ వేశారు.

- Advertisement -

ఐఎస్ఎస్ కూల్చివేతను మూడు దశల్లో జరగనుంది. తొలి దశలో ఐఎస్ఎస్‌లోని ఉష్టోగ్రతను నియంత్రించి సౌర ఫలకాలను వేరు చేస్తారు. సెకండ్ ఫేజ్‌లో అంతరిక్ష కేంద్రానికి వెన్నుముక లాంటి ట్రస్ నుంచి ఇతర భాగాలను విడదీస్తారు. చివరి స్టేజ్‌లో ఐఎస్ఎస్ కక్ష్యను క్రమంగా కుదిస్తూ భూవాతావరణంలోకి అత్యధిక వేగంతో ప్రవేశించేలా చేస్తారు.

ఈ క్రమంలో విడి భాగాలు ఆకాశంలో మండి బూడిదైపోతాయి. అందుకు సంబంధించి మిగతా శకలాలను మాత్రం పసిఫిక్ సముద్రంలో కూలేలా వాటి గమనాన్ని నిర్థేశిస్తారు. గతంలో స్కైలాబ్ మితగావి కూల్చివేత ఆధారంగా శాస్ర్తవేత్తలు ఈ ప్లాన్ రెడీ చేశారు. ఇప్పటికే అనేక ఉపగ్రహాలను శకలాలు పసిఫిక్ సముద్రంలో పడిన విషయం తెల్సిందే.

అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా, ఐరోపా, జపాన్, కెనడా, రష్యాలు కలిసి దీన్ని నిర్మాణ బాధ్యతను చేపట్టాయి. అంతరిక్షలో అతి పెద్ద మానవ నిర్మిత కట్టడంగా ఇది రికార్డు సాధించింది. 1998లో తొలి దశ ప్రారంభమైంది. 2000 ఏడాది నుంచి ఆపరేషన్స్ మొదలయ్యాయి.

ALSO READ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 12మంది మృతి

భూమికి 400 కిలోమీటర్లు ఎత్తులోవున్న కక్ష్యలో ఐఎస్ఎస్ ఉంటుంది. సుదీర్ఘకాలం సేవలందించిన ఐఎస్ఎస్, ముగింపు దశకు చేరుకుంది. తరచూ  రకారకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని తొలగించేందుకు సిద్ధమైంది నాసా. రష్యాతో కాంట్రాక్ట్ 2028తో ముగియనుంది. అయితే అమెరికా ఇతర దేశాలు మాత్రం 2030 వరకు నిర్వహణ చేపడతాయి. ఈ మధ్యకాలంలో స్పేస్ ఎక్స్ తన పనులను ముమ్మరం చేయనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News