Big Stories

Elon Musk says should eliminate EVMs: ఈవీఎంలపై ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk says should eliminate EVMs: ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టెక్ దిగ్గజం ఎలన్ మస్క్. ఈవీఎంలు హ్యాకింగ్ బారినపడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. మనం ఎన్నికల్లో ఈవీఎంలను వాడకూడదని, వీటిని మనుషులు, ఏఐ ద్వారా హ్యాకింగ్ చేసే అవకాశం తక్కువే అయినా, దీన్ని ప్రమాదకరంగా పరిగణించాలని పోస్టు చేశారు.

- Advertisement -

ఉన్నట్లుండి ఎలన్‌మస్క్ ట్వీల్ వెనుక కారణాలు లేకపోలేదు. పోర్టూరీకో దేశంలో ఈవీఎంల అవకతవకలు బయటపడిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట పోర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి అనేక అవకతవకలు వెలుగుచూశాయి. అయితే ఈవీఎంలకు అనుసంధానంగా ఓటు స్లిప్పులు ఉన్నాయి. దీంతో తప్పు ఎక్కడ జరిగిందో అధికారులు వెంటనే గుర్తించి ఓట్ల లెక్కింపును చేపట్టారు.

- Advertisement -

దీనికి సంబందించి అమెరికా దివంగత మాజీ అధ్యక్షుడు కెన్నడీ రిలేటివ్ ఒకరు దీన్ని పోస్టు చేశారు. దాన్ని ఎలన్ మస్క్ షేర్ చేశారు. ఈమెరికాలో ఈవీఎంలపై అక్కడి ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇప్పటికీ అక్కడ బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరుగుతాయి.

రీసెంట్‌గా ఇండియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయాన్నికొద్దాం. కౌంటింగ్ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈసారి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు రావడంతో ఈవీఎంలపై సైలెంట్ అయ్యారని, లేకుంటే ఈవీఎంలు టాంపరింగ్ అయ్యాయని దుయ్యబట్టే వారంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు.

2019 ఎన్నికల తర్వాత కూడా ఈవీఎంలు టాంపరింగ్ అయ్యాయంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడంతో ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.

ALSO READ: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు

ఇండియాలో ఈవీఎంలను ఆధునికరించడంతో ఐఐటీలది కీలక పాత్ర. అంతేకాదు ఇందులో డేటా పోకుండా దాదాపు పదేళ్ల వరకు ఉంటుంది కూడా. ఎన్నికల కమిషన్ కు చెందిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ కూడీ ఈవీఎంల భద్రత విషయంలో చర్యలు చేపడుతోంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News