Big Stories

Earth Quake in Iran : ఇరాన్ లో భారీ భూకంపం.. నలుగురు మృతి

Earth Quake in Iran(Latest international news today): ఇరాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ఇరాన్ ప్రావిన్స్ ఖొరాసన్ రజావిలోని కష్మర్ కౌంటీలో 5.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. నలుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 120 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

కాగా.. గాయపడినవారిలో 35 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, స్వల్పంగా గాయపడిన వారు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లు కాష్మార్ గవర్నర్ హోజ్జతోల్లా షరియత్మదారి తెలిపింది. భూకంపం ధాటికి భవనాల శిధిలాలు మీద పడటంతో ఇద్దరు, భవనం కూలడంతో మరో ఇద్దరు మరణించినట్లు జిన్హువా మీడియా సంస్థ వెల్లడించింది.

- Advertisement -

స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.24 గంటలకు భూకంపం సంభవించింది. 6 కిలోమీటర్ల లోతులో వచ్చిన భూ ప్రకంపలనకు సమీపంలోని భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం వచ్చిన కష్మర్ కౌంటీలో 1,63,000 జనాభా ఉన్నారు. కాగా.. 2003లో ఇరాన్ లోని బామ్ నగరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో 31 వేల మందికి పైగా ప్రజలు మరణించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News