Big Stories

Civil servant robot suicide: రోబో సూసైడ్.. అదెలా సాధ్యం.. ఇంతకీ ఎక్కడ?

Civil servant robot suicide: కష్టాలు మానవులే కాదు.. మర మనిషి ఉంటాయా? యావత్ ప్రపంచం షాకయ్యే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోని తొలిసారి సౌత్‌కొరియాలో రోబో ఆత్మహత్య చేసుకుంది. ఇదేదో విచిత్రంగా ఉంది కదూ.. ఆశ్చర్యంగా ఉన్నా నమ్మలేని నిజం.

- Advertisement -

ప్రపంచంలో అత్యధికంగా రోబోలను వినియోగిస్తోంది దక్షిణకొరియా. ప్రతీ 10 మంది ఉద్యోగులకు ఓ రోబో విధులు నిర్వహిస్తోంది. గుమీ సిటీలోని సివిల్ సర్వీసు ఆఫీసులో విధులు నిర్వహిస్తోంది ఓ రోబో. ఈక్రమంలో రెండు మీటర్లు పొడవున్న మెట్ల పైనుంచి సడన్‌గా పడిపోయింది. ముక్కులు ముక్కలైంది.  దాని తర్వాత ఏమాత్రం కదలిక లేదు. ఈ ఘటనకు ముందు వింతగా ప్రవర్తించిందని అక్కడ ఆఫీసులోని ఉద్యోగులు చెబుతున్నమాట.

- Advertisement -

రోబోలు భావోద్వేగాలకు గురయ్యే ఛాన్స్ లేదు. రోబో కదలికలో ఉపయోగపడే నేవిగేషన్‌లో లోపాలు తలెత్తే ఛాన్స్ ఉందని అంటున్నారు. సెన్సార్ల వైఫల్యం, ప్రొగ్రామింగ్‌లో బగ్‌ల వల్ల ఇలా విచిత్రంగా ప్రవర్తించ వచ్చనే చర్చ జరుగుతోంది. అధిక పని భారంతో సాంకేతిక లోపం తలెత్తడం దీనికి కారణంగా రోబో నిఫుణులు చెబుతున్నమాట.

రోబో సూపర్‌వైజర్‌గా అందరూ పిలిచే ఆ మర మనిషి గతేడాది ఆగస్టు నుంచి సేవలు అందిస్తోంది. సివిల్ సర్వీస్ ఆఫీసులో దానికి ఓ ఐడీ కార్డు కూడా ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు పనిచేస్తుంది. రోజువారీ పేపర్స్ అందజేయడం, స్థానికులు కోరే సమాచారం వెల్లడించడం, మిగతా పనులు చురుగ్గా చేసేందని ఆఫీసులోని ఓ అధికారి చెబుతున్నమాట.

నార్మల్‌గా అయితే రోబోలు ఒక ఫ్లోర్‌కు మాత్రమే పరిమితమవుతాయి. ప్రస్తుత రోబో మాత్రం లిప్ట్‌ ఎక్కి వివిధ అంతస్థులకు వెళ్లి అక్కడ పనులు చేస్తుంది. దీని ప్లేస్‌లో మరొక రోబో సేవలు వినియోగించే ఉద్దేశం లేదని చెబుతోంది ఆఫీసు.

ALSO READ: బుక్కైన ఇండో అమెరికన్ వ్యాపారవేత్త రిషి షా, ఏడున్నరేళ్ల జైలు

కాలిఫోర్నియాకు చెందిన రోబోట్ వెయిటర్ స్టార్టప్ సంస్థ దీన్ని తయారు చేసింది. రోబో తనను తాను అంతం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామని ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. ముక్కలైన రోబోను సేకరించామని, త్వరలో దానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తామని అంటున్నారు. ఈ మేటర్ తెలుసుకున్నవారికి తెలుగులో రజినీకాంత్ నటించి రోబో సినిమా గుర్తుకొస్తుందని అంటున్నారు నెటిజన్స్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News