Big Stories

South China Sea: సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో చైనా దాడి

South China Sea: దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డు బలగాలు దాడికి పాల్పడ్డాయి. అంతే కాకుండా ఫిలిప్పీన్స్ దళాల పడవలను కత్తులు, గొడ్డళ్లతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. దీనిపై ఫిలిప్పీన్స్ దేశ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఫిలిప్పీన్స్ అధికారి మాట్లాడుతూ.. తమ నౌకా దళానికి చెందిన రెండు బోట్లు బుధవారం సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం, ఇతర వస్తువులు తీసుకువెళుతుండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

మొదట బీజింగ్ దళాలే ఫిలిప్పీన్స్ దళాలతో వాదనలకు దిగి .. అనంతరం బోట్‌లోకి చొరబడ్డారు. అనంతరం వారి పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎంఫోర్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు అక్కడే ఉన్న నేవిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటన వేలు కూడా తెగిపోయింది. అనంతం ఫిలిప్పీన్స్ పడవలను చైనా దళాలు చుట్టుముట్టాయి.

- Advertisement -

Also Read: రెండ్రోజులకే బయటపడిన కెనడా బుద్ధి.. బలుపా ? బరితెగింపా?

కోస్ట్ గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనలను డ్రాగన్ దేశం గత శనివారం అమలులోకి తెచ్చింది. అయితే చట్టం ప్రకారం జల సరిహద్దులు అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచి 60 రోజుల పాటు నిర్భందించే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో జరిగిన ఈ ఘర్షణపై ఫిలిప్పీన్స్ స్పందించింది. యునైటెడ్ స్టేట్స్‌ను మరొక ప్రపంచ వివాదంలోకి లాగడానికే ఈ దాడి అని ఆరోపించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News