Big Stories

India-China: నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రశంసలు

India – China: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని ఆయన ప్రశంసించారు. భారత్, చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సమయంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగానే భారత విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. అంతే కాకుండా ప్రపంచంలో నెలకొన్న ఘర్షణల ముగింపుకు ఈ ఐదు సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయని అన్నారు.

- Advertisement -

భారత్ – చైనా మధ్య కుదిరిన పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్ పింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచశీల ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామం. శాంతి అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానం ఇచ్చాయి. చైనా – భారత్, చైనా – మయన్మార్‌తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను గత నాయకత్వం చేర్చింది. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందని జిన్ పింగ్ గుర్తు చేశారు.

- Advertisement -

పంచశీల ఒప్పందం ఆసియాలో పుట్టింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. 1960లో మొదలైన అలీనోద్యమానికి ఈ పంచ శీల సూత్రాలు మార్గదర్శకాలుగా నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలు, చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయి. ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఇవి ఎంతగనో ఉపయోగపడతాయి. ప్రపంచ భద్రత కోసం మేం తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లోనూ విధానాలు అనుసరించాలని అనుకుంటున్నట్లు జిన్ పింగ్ తెలిపారు.

పంచశీల ఒప్పందం అంటే ?
పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో భారత్ – చైనా మధ్య ఈ ఒప్పందం కుదిర్చారు. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు నెహ్రూ, చౌ‌-ఎన్‌లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు గుర్తింపు పొందాయి.

Also Read: రేసు మొదలైంది.. ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్‌ డిబేట్

దీనిలోని అంశాలు:
1.సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించడం
2.ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం
3.దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కారం చేసుకోవడం
4.అంతర్జాతీయ సంబంధాల్లో సహకారం కోసం కృషి చేయడం, పరస్పర గౌరవం
5. పొరుగు దేశాలతో శాంతియుతంగా ఉండటం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News