Big Stories

China expels Ex defence ministers: చైనా కీలక నిర్ణయం, మాజీ రక్షణశాఖ మంత్రులపై బహిష్కరణ వేటు

China expels Ex defence ministers: చైనాలో పాలకులు తీసుకున్న నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. అధికారులైనా, మంత్రులైనా పనిష్మెంట్ సీరియస్‌గా ఉంటుంది. అందువల్లే అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి ప్రధాన కారణం. తాజాగా చైనాలో ఇద్దరు మాజీ రక్షణశాఖ మంత్రులకు ఊహించని షాకిచ్చారు అధ్యక్షుడు జిన్‌పింగ్. జనరల్ వే ఫంగ్లా, లీషాంగ్‌ఫు లపై బహిష్కరణ వేటు వేసింది. మాజీ మంత్రులిద్దరు అవినీతికి పాల్పడడమే ముఖ్యకారణం.

- Advertisement -

అవినీతిపరులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని తరచూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతున్నమాట. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన హయంలో రక్షణశాఖ మంత్రులుగా పని చేసిన జనరల్ వే ఫంగ్లా, లీషాంగ్‌ఫు లపై చైనా కమ్యూనిస్టు పార్టీ బహిష్కరణ వేటు వేసింది. వీరిద్దరు రక్షణశాఖలో భారీగా అవినీతికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

అవినీతికి పాల్పడినట్టు తేలడంతో మాజీ మంత్రులపై వేటు వేసినట్టు చైనా అధికారిక వార్త సంస్థ వెల్లడించింది. 2018-23 చైనా రక్షణశాఖ మంత్రిగా విధులు చేపట్టారు జనరల్ వే ఫంగ్లా, లీ షాంగ్‌ఫు‌లు. అంతేకాదు పార్టీ స్టేట్ కౌన్సిలర్, సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యులుగా పని చేసిన అనుభవం వీరి సొంతం. ఇద్దరు నేతలు అధికారాలను దుర్వినియోగం చేశారని, ఈ క్రమంలో భారీ మొత్తంలో నిధులు, విలువైన వస్తువులు స్వీకరించారని దర్యాప్తులో తేలింది. గతేడాది నుంచి వీరిద్దరు కనిపించకుండా పోయారు. ఫంగ్హా అయితే ఈ ఏడాది మే లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించారు.

ALSO READ: మాల్దీవులు అధ్యక్షుడిపై క్షుద్రపూజలు.. ఇద్దరి అరెస్ట్!

సింపుల్‌గా చెప్పాలంటే చైనాలో మిగతా మంత్రులకు, అధికారులకు అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇచ్చే వార్నింగ్ అన్నమాట. అక్కడ తప్పు చేస్తే మంత్రులైనా, అధికారులైనా కనిపించరు. చివరకు బహిష్కరించినట్టు మాత్రమే స్టేట్‌మెంట్ వస్తుంది. ఆ తర్వాత వారు ఎక్కడ ఉన్నారనే విషయం కూడా బయట ప్రపంచానికి  తెలీదు. ఒకవేళ బయటకు వెళ్తే దేశానికి సంబంధించిన విషయాలు బయటపెడతారని భావించి ప్రభుత్వ మే బహిష్కరిస్తున్నట్లు ప్రకటన ఇస్తుందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News