Big Stories

China Created History: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుడి మట్టి నమూనాతో తిరిగొచ్చిన చాంగే- 6..

Chang’e-6 Bring Sand Samples from Moon: చైనా ప్రయోగించిన చాంగే-6 ప్రోబ్, చంద్రుడుపై నుంచి విజయవంతగా భూమిపైకి తిరిగి వచ్చింది. తొలి సారి జాబిల్లి అవతలి వైపు నుంచి రాళ్లు, మట్టి నమూనాలు సేకరించిన చాంగే-6 ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతలంలో ల్యాండ్ అయింది. చాంగే-6 ల్యాండింగ్ కోసం అధికారులు నెల రోజుల ముందు నుంచే విస్తృత ఏర్పాట్లు చేశారు. చాంగే-6 ప్రోబ్ తీసుకొచ్చిన నమూనాలు 20 లక్షల 50 వేల ఏళ్ల క్రితానికి చెందిన అగ్ని పర్వత శిలలకు సంబంధించినవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

- Advertisement -

చంద్రుడి అవతలి వైపు అగ్ని శిలలు, క్రేటర్స్ ఉంటాయని ఇప్పటికే స్పష్టమైంది. అయతే చాంగే- 6 తీసుకువచ్చిన నమూనాలు చంద్రుడి పుట్టుకతో పాటు, ఉల్కాపాతం వంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు చేయడానికి కీలకం కానున్నాయి. జాబిల్లి ఉపరితలాల మధ్య భౌగోళిక వ్యత్యాసాల గురించిన ప్రశ్నలకు సమాధానాలు తెలియనున్నాయి. గతంలో అమెరికా, సోవియట్ మిషన్లు చంద్రుడి దగ్గరి వైపు నుంచి మట్టి నమూనాలను సేకరించాయి. అయితే తాజాగా చైనా తొలిసారిగా చంద్రుడి దూర ప్రాంతాల నుంచి మట్టిని సేకరించింది.

- Advertisement -

చాంగే-6 ను మే 3న చైనా ప్రయోగించింది. 53 రోజులు ప్రయాణించిన తర్వాత చాంగే-6 చంద్రుడిని చేరింది. కోర్ ప్రాంతంలో డ్రిల్ చేసి ఉపరితలం నుంచి మట్టి, రాళ్లను సేకరించింది. గతంలోనూ చైనా చాంగే-5 ప్రోబ్‌ను చంద్రుడిపైకి పంపింది. తద్వారా చైనా నమూనాలను సేకరించింది. జాబిల్లికి సంబంధించి మనకు కనిపించే ఇవతలి వైపు నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకుని వచ్చింది. కానీ చంద్రుడి అవతలి వైపు నుంచి ఈ నమూనాలను తీసుకురావడం క్లిష్టమైన ప్రక్రియ. చంద్రుడి అవతలి వైపు ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు కూడా పెద్దగా అవగాహన లేదు.

Also Read: అమెరికాలో పోటెత్తిన వరద.. తెగిన మిన్నెసోటా డ్యామ్‌

చాంగే-6 యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతో పాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి వైపు చదునుగా ఉంటుంది. జాబిల్లి అవతలి భాగం కూడా మందంగా ఉందని పరిశోధనల్లో రుజువైంది. దీనికి కారణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి.

మే 3న హైవాన్ నుంచి చాంగ్- 6 అంతరిక్ష నౌకను చైనా ప్రయోగించింది. ఇది జూన్ 1న చంద్రుడి యొక్క అత్యంత పురాతనమైన, లోతైన బిలం అయిన దక్షిణ ధృవం ఐట్‌కెన్ బేసిన్ అంచుపైకి దిగింది. అయితే ఒక స్కూప్ డ్రిల్‌తో కూడిన యంత్రం సహాయంతో దాని ఉపరితం నుంచి మట్టి నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను సేకరించడానికి చాంగ్- 6 రెండు రోజుల సమయం తీసుకుంది. జూన్ 21 న ఇది భూమికి తిరుగు ప్రయాణం అయింది. చంద్రుడి అవతలి వైపునకు అంతరిక్షనౌక విజయవంతగా ప్రయోగించడం మానవ చంద్రుడి అన్వేషణ చరిత్రలో అపూర్వమైన విజయమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా అభివర్ణించింది. చైనా అంతరిక్ష ప్రణాళికలో భాగంగా 2030 నాటికి చంద్రుడిపైకి సిబ్బందిని పంపి అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News