Big Stories

Hindenburg report: సీనియర్ అడ్వకేట్.. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై కీలక వ్యాఖ్యలు.. ఆపై చైనా..

Hindenburg report: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రిపోర్టు వివాదంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీనియర్ అడ్వకేట్ మహేష్ జెఠ్మలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ రిపోర్టు వెనుక చైనా ప్రమేయముందన్నది అందులోని సారాంశం.

- Advertisement -

ఇంతకీ సీనియర్ అడ్వకేట్ లేవనెత్తిన అంశాల లోతుల్లోకి వెళ్తే.. అదానీ గ్రూప్‌పై నివేదికను రూపొందిం చేందుకు హిండెన్ బర్గ్‌ను అమెరికన్ బిజినెస్‌మేన్ మార్క్‌ కింగ్‌డన్ నియమించారన్నది అందులోని ప్రధాన పాయింట్. అదానీ షేర్లలో ట్రేడింగ్ కోసం కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కింగ్‌డన్ సంప్రదించాడన్నది రెండో పాయింట్. ఆ విధంగా కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందు మారిషష్ ద్వారా అదానీ షేర్లలో పెద్ద ఎత్తున షార్ట్ పొజిషన్ తీసుకుంది. ఇందుకోసం కింగ్‌డన్ మాస్టర్ ఫండ్ నిధులు అందించింది. ఇందులో కింగ్‌డన్ వైఫ్ అన్లాచెంగ్‌ సహా ఆయన ఫ్యామిలీకి వాటాలున్నాయి.

ఇంతకీ అన్లాచెంగ్ ఎవరు? ఈమె చైనీస్ అమెరికన్. అక్కడ చైనీస్ ప్రయోజనాల కోసమే ఆమె పని చేస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు సీనియర్ లాయర్. ఆమె చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహిస్తున్నారు. వాటికి కమ్యూనిస్టు పార్టీలతో రిలేషన్ ఉందని తేలడంతో మూతపడ్డాయని అడ్వకేట్ మహేష్ జెఠ్మలానీ ప్రధాన ఆరోపణ.

ఈ లెక్కన హిండెన్‌బర్గ్ నివేదిక రూపకల్పనలో సహకరించిన భారత ఆర్థిక సంస్థలు, బిజినెన్‌మేన్లు, రాజకీయ నేతలకు చైనా మూలాల గురించి ముందే తెలుసా అని ప్రశ్నించారాయన. అసలు కెఎంఐఎల్‌ను కింగ్‌డన్‌ను ఎవరు పరిచయం చేశారు? వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సెబీని కోరారు మహేష్ జెఠ్మలానీ.

ALSO READ: యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం

మొత్తానికి హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అసలు తేనెతుట్టెను కదిపారు సీనియర్ లాయర్ మహేష్ జెఠ్మలానీ.  ఇప్పుడు సెబీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య దుమారం రేగడం ఖాయమన్నది రాజకీయ నిపుణుల మాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News