Big Stories

Canada Parliament Issue : రెండ్రోజులకే బయటపడిన కెనడా బుద్ధి.. బలుపా ? బరితెగింపా?

Canada Parliament Issue : కెనడా.. కాస్త తేడా. అవును.. ఆ దేశం అనుసరించే విధానాలను చూస్తుంటే ఇప్పుడిదే మాట అనాల్సి వస్తుంది. వారు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. జీ7 సమ్మిట్‌లో మన దేశ ప్రధాని నరేంద్రమోదీతో షేక్‌ హ్యాండ్‌ చేసిన రోజుల వ్యవధిలోనే.. మరోసారి ఇన్‌డైరెక్ట్‌గా ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో కెనడా తోక వంకర అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

- Advertisement -

కొన్నిరోజుల క్రితం ఇటలీలో జీ7 సమ్మిట్ జరిగింది. ఈ భేటీకి భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. అక్కడ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. మోడీతో భేటీ అయ్యారు. మన దేశంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన తర్వాత మోడీతో నేరుగా భేటీ అవ్వడం ఇదే ఫస్ట్‌టైమ్. ఇండియాతో సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశాలను పరిశీలిస్తామంటూ ప్రకటన కూడా చేశారు ట్రూడ్. ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న ఇరు దేశాల సంబంధాలు సెట్ అవుతాయనుకున్నారంతా. బట్‌.. కెనడా ఏం చేసింది. పుండు మీద కారం చల్లే విధంగా వ్యవహరించింది. ఏకంగా కెనడా పార్లమెంట్‌లో మన దేశం టెర్రరిస్ట్‌గా ప్రకటించిన ఓ వ్యక్తి వర్ధంతి సందర్భంగా మౌనం పాటించారు. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది బలుపా? బరితెగింపా? ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారా? అనేది వారికే తెలియాలి.

- Advertisement -

ఎవరీ నిజ్జర్‌? మరోసారి గుర్తు చేసుకుందాం.. అప్పుడే కెనడా బరితెగింపు సరిగ్గా అర్థమవుతుంది. హర్దీప్ సింగ్ నిజ్జర్.. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చీఫ్‌. సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలనే డిమాండ్‌తో ఈ సంస్థ పనిచేస్తుంది. దీని కోసం కెనడాలో ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతుంది ఈ సంస్థ. ఇండియా రిలీజ్‌ చేసిన 40 మంది ఖలిస్థాని టెర్రరిస్టుల లిస్ట్‌లో నిజ్జర్‌ కూడా ఉన్నాడు. అలాంటి నిజ్జర్‌ను గతేడాది జూన్‌ 18న కొందరు దుండగులు కాల్చి చంపారు. ఆ రోజు నుంచి భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఓ టెర్రరిస్ట్‌ను పట్టుకొని తమ దేశ పౌరుడిని ఇండియా ప్రభుత్వం చంపించింది అంటూ విమర్శలు చేయడం ప్రారంభించింది. అసలు ఈ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దర్యాప్తుకు కూడా సహకరించింది.. ఇంకా ఈ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్‌, కరణ్‌ప్రీత్ సింగ్‌ అనే నిందితులు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు.

Also Read : సంచలన నిర్ణయం తీసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని

నిజానికి ఓ దేశంలోని మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ను తమ దేశ పౌరుడని చెప్పుకోవడమే సిగ్గు చేటు అంటే.. అలాంటి వ్యక్తికి పార్లమెంట్‌లో నివాళులు అర్పించడం ఏంటి అనేది అసలు ప్రశ్న. సరే మన దేశం అంటే అక్కసుతో ప్రకటించింది అనుకుందాం. కానీ ఇంటర్‌పోల్ కూడా అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. మరి అలాంటి టెర్రరిస్ట్‌కు నివాళులు అర్పించి.. తాము కూడా ఖలిస్థాని తీవ్రవాదానికి మద్దతునిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారా? ఏమో వారికే తెలియాలి మరి. అసలు నిజ్జర్‌ విషయంలో కెనడా గతంలో ఎలా వ్యవహరించిందో గుర్తు చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే నిజ్జర్‌కు కెనడా పౌరసత్వం ఇచ్చేందుకు మొదట నిరాకరించింది కెనడా ప్రభుత్వం కాదా? చివరికి అక్కడి పౌరసత్వం ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే కానీ అతడికి కెనడా పౌరసత్వం దక్కలేదు. మరి ఈ విషయాలన్నీ కెనడా ప్రభుత్వం మరిచినట్టుంది. అలాంటి నిజ్జర్‌ను ఏదో ప్రజల కోసం పోరాటాలు చేసి అమరుడైనట్టు ట్రీట్‌ చేస్తుంది.

అయితే ఇక్కడోసారి టైమింగ్‌ను గమనించండి. జీ-7 సమ్మిట్‌లో మోడీ-ట్రూడో భేటీ కాగానే కొన్ని పరిణామాలు చకా చకా జరిగాయి. అందులో మొదటిది గురుపన్వంత్ సింగ్‌ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందన్న కేసులో మొదట కదలిక వచ్చింది. ఈ ఖలిస్థాని టెర్రరిస్ట్‌ తమ పౌరుడంటూ అమెరికా కూడా గర్వంగా చెబుతుంది. పన్నూన్‌ హత్యకు కుట్ర జరిగింది. దానిని పక్కాగా అడ్డుకున్నామని చెబుతోంది. దీనికి సంబంధించి ఓ ఇండియన్‌ను చెక్‌ రిపబ్లిక్‌లో అరెస్ట్ కూడా చేశారు. జీ-7 సమ్మిట్‌ ముగియగానే అతడిని అమెరికా అదుపులోకి తీసుకుంది. అదేంటో మరి ఆ వెంటనే నిజ్జర్‌కు పార్లమెంట్‌లో నివాళులు. అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడొద్దని ఎవరైనా భావిస్తున్నారా? అందుకే తెర వెనక ఉండి ఈ కథంతా నడిపిస్తున్నారా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది.

Also Read : దేశాధ్యక్షుడి భద్రతా సిబ్బందిని బెదిరించి దోచుకున్న దొంగలు

కానీ కెనడా ఓవరాక్షన్‌కు భారత విదేశాంగశాఖ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. 1985లో ఖలిస్థాని ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిని గుర్తు చేసింది. ఆ రోజు అసలేం జరిగిందో ఓ సారి గుర్తు చేసుకుందాం. జూన్‌ 23, 1985లో ఎయిరిండియా విమానమైన కనిష్కను ఖలిస్థానీ ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు. ఈ ప్రమాదంలో 329 మంది చనిపోయారు. వారిలో 86 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా సిటిజన్స్‌ ఉండగా.. 27 మంది బ్రిటిష్‌, 24 మంది ఇండియన్స్ ఉన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదం వల్ల వీరంతా మృతి చెందారని గుర్తు చేసింది. ఈ ప్రమాదం జరిగి 39 ఏళ్లు అవుతున్న సందర్భంగా కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న ఎయిరిండియా మెమోరియల్ వద్ద నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేసింది. ఇది నిజంగా టిట్ ఫర్ టాట్.. అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఖలిస్థానీ టెర్రరిజమ్ వల్ల జరిగిన నష్టాన్ని మీరు మర్చిపోయినా.. మేం మర్చిపోలేదని ఇండియా చెప్పకనే చెప్పింది. అంతేకాదు మీరు వెనకేసుకొస్తున్న ఖలిస్థానీలు ఏదో ఒక రోజు మీకు ఏకు మేకవ్వవడం ఖాయమని హెచ్చరిక పంపింది ఇండియా.

జస్ట్ ఫర్‌ డిబెట్ సేక్.. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒసామా బిన్‌ లాడెన్‌కు పాకిస్థాన్‌ పార్లమెంటో లేదా ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వమో అధికారికంగా నివాళులు అర్పిస్తే.. ఇదే కెనడా, అమెరికా రియాక్షన్ ఎలా ఉండేవి.. ? నిజానికి ఇండియా చాలా పద్ధతిగా రెస్పాండ్ అయ్యింది. కానీ దీనికి తగ్గ జవాబును కెనడాకు ఇండియా ముందు ముందు ఇవ్వడం మాత్రం ఖాయం. అంతేకాదు ఈ రోజు ఖలిస్థానీలకు పాలుపోసి పెంచుతూ వెనకేసుకొస్తున్న కెనడాను చూస్తుంటే.. తీవ్రవాదులను పెంచి పోషించి ఇప్పుడు జుట్టుపీక్కుంటున్న పాకిస్థాన్‌ గుర్తుకొస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News