Big Stories

Apple: భార్యకు దొరికిన రాసలీలలు.. యాపిల్ కంపెనీకి షాకిచ్చిన భర్త..

British Man sues Apple: ఇంగ్లాండ్ లో వింత ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తికి పెళ్లి అయ్యింది. అయితే, ఇతను తన భార్యకు తెలియకుండా అమ్మాయిలతో రాసలీలలు సాగించాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయిలతో జోరుగానే చాటింగ్ చేశాడు. అది బయటకుండా ఉండేందుకు ఆ మెసేజ్ లను డిలీట్ చేశాడు. అయినా అవి తన భార్య కంట పడ్డాయి. విషయం బయటపడడంతో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. దీనంతటికి కారణం యాపిల్ సంస్థనేనంటూ దానిపై దావా వేశాడు. అంతేకాదు.. తనకు జరిగిన నష్టానికి రూ. 53 కోట్ల వరకు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

- Advertisement -

లండన్ కు చెందినటువంటి ఓ వ్యాపారి పలువురు సెక్స్ వర్కర్లతో రాసలీలలు నడిపించాడు. ఈ క్రమంలో తన ఐఫోన్ లోని ఐ మెసేజ్ యాప్ నుంచి వారికి చాటింగ్ చేసేవాడు. ఈ విషయాలన్నీ తన భార్యకు తెలియకుండా ఉండేందుకు వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేశాడు. అయితే, అతను ఇదే యాపిల్ ఐడీని తన కుటుంబానికి చెందిన ఐమ్యాక్ లోనూ ఉపయోగించాడు. దీంతో ఫోన్లో ఆ మెసేజ్ లను డిలీట్ చేసినా కూడా అవి ఐమ్యాక్ లో డిలీట్ కాలేదు.. అలాగే ఉండిపోయాయి. ఒక రోజు ఐమ్యాక్ లో ఉన్న చాటింగ్ వివరాలు భార్య కంటపడ్డాయి. వాటిని పరిశీలించగా భర్త గారి అసలు రూపం బయటపడింది. ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది. ఆ తరువాత ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. చేసిన తప్పుకు చింతించకుండా అతను యాపిల్ కంపెనీపై దావా వేశాడు.

- Advertisement -

Also Read: ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు.. ఎందుకంటే ?

‘ఫోన్ లో ఉన్న మెసేజ్ లను డిలీట్ చేసినప్పుడు అవి పూర్తిగా తొలగిపోతాయని అనుకుంటాం. కానీ, లింక్ చేసిన అన్ని డివైజ్ లలో ఆ మెసేజ్ లు ఉండిపోతాయన్న విషయాన్ని యాపిల్ యూజర్లకు స్పష్టంగా తెలియజేయలేదు. ఈ ఒక్క డివైజ్ లోనే మెసేజ్ లు డిలీట్ అయ్యాయి అంటూ ముందే యూజర్లకు ఓ సందేశమిస్తే అప్రమత్తమవుతారు కదా. ఈ విషయాన్ని యాపిల్ కంపెనీవారు సరిగ్గా తెలియజేయలేదు. నేను డిలీట్ చేసిన మెసేజ్ లను నా భార్య గుర్తించి, నాకు విడాకులు ఇచ్చింది. దీంతో నేను 5 మిలియన్ పౌండ్లు నష్టపోయాను. ఈ విషయాన్ని నేను మెల్లిగా సర్దిచెప్పేవాడిని. అప్పుడు మా వివాహబంధం కొనసాగేదేమో. కానీ, ఆమె నేరుగా ఆ మెసేజ్ లను చూడడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది’ అంటూ ఆ వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇందుకు గానూ తనకు యాపిల్ కంపెనీ 5 మిలియన్ పౌండ్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ఈ పిటిషన్ ను కోర్టు త్వరలోనే విచారించనున్నట్లు తెలుస్తోంది. 5 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ. 53 కోట్లు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News