Big Stories

Bomb blasts in Nigeria: నైజీరియాలో పెను విషాదం..బాంబు పేలుళ్లలో 18 మంది మృతి

Nigeria Shaken by deadly Suicide Attacks: నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. వరుసగా ఆత్మాహుతి దాడులతో నైజీరియా వణికిపోతోంది. ఈశాన్యబోర్నో రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందగా.. మరో 50 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో 19మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

- Advertisement -

గ్వోజా నగరంలో ఓ వివాహ వేడుక జరుగుతుండగా..మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత గ్వోజాలోని జనరల్ ఆస్పత్రి వద్ద రెండవ పేలుడు జరిగింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మూడవ పేలుడు సంభవించింది. ఇలా వరుస పేలుళ్లతో గ్వోజా నగరం భయాందోళనకు గురైంది. ఈ ఆత్మాహుతి దాడులకు స్థానికులు వణికిపోయారు. ఏం జరుగుతుందోనని భయంతో పరుగులు తీశారు.

- Advertisement -

ఆత్మాహుతి బాంబర్లు గ్వోజా నగరంలోని వివాహ వేడుక, అంత్యక్రియలు. ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు స్టేట్ ఎమెర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో మహమ్మద్ సైదు తెలిపారు. ఈ బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారిలో గర్భిణులు, చిన్నారులు, మహిళలు ఉన్నారు. అనంతరం ఆయన గ్వోజాలో పేలుడు జరిగిన సంఘటనా స్థలాలను పరిశీలించారు. అనంతరం సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్వోజా నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై అదే నగరంలో సైన్యానికి మద్దతు ఇస్తున్న మిలీషియా సభ్యుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ భద్రతపై కూడా దాడి జరిగినట్లు చెప్పాడు. ఈ దాడిలో ఇద్దరు సహోద్యోగులు, సైనికుడు మృతి చెందినట్లు వెల్లడించాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ఈ దాడిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడులు చేసింది ఉగ్రవాద సంస్థ కాదని తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది మహిళలు అన్నారు. వాస్తవానికి బోర్నో ఆఫ్ నైజీరియాలో ఉగ్రవాదు గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. మొదట ఈ దాడి బోకోహరమ్ పైనే జరిగిన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ తో చేతులు కలిపడం ద్వారా నైజీరియాలో ఉగ్రవాద పరిధి పెరుగుతోంది. ఇప్పటికే వేలాది మందిని దారుణంగా హత్య చేసిందనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News