Big Stories

Benjamin Netanyahu: సంచలన నిర్ణయం తీసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని

Benjamin Netanyahu has dissolved War Cabinet: హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నఇజ్రాయెల్.. గాజాలో సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో కీలక ప్రకటన విడుదల అయ్యింది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైనటువంటి వార్ క్యాబినెట్ ను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్, గాడీ ఐసెన్ కోట్ లు ఇటీవల దీని నుంచి బయటకు వచ్చినవేళ ఈ పరిణామం చోటుచేసుకున్నది.

- Advertisement -

అయితే, గత ఏడాది అక్టోబర్ 6న ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడులకు పాల్పడింది. దీంతో టెల్ అవీవ్ సైతం ప్రతిదాడులు ప్రారంభించింది. యుద్ధ సమయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఐక్యత ప్రదర్శించేందుకు బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని ప్రతిపక్ష నేషనల్ యూనిటీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఆ తరువాత అదే నెల 11న నెతన్యాహు, గాంట్జ్ సహా ఆరుగురు సభ్యులతో కూడిన ‘వార్ క్యాబినెట్’ ఏర్పాటు అయ్యింది. గాజాలో యుద్ధంపై ఈ వార్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది.

- Advertisement -

Also Read: పాకిస్థాన్ కంటే భారత్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువ: SIPRI నివేదిక

కాగా, నెతన్యాహు యుద్ధాన్ని నడిపిస్తున్న తీరుపై గాంట్జ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇటీవల ప్రభుత్వం నుంచి వైదొలిగారు. యుద్ధానంతర ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. బందీల విడుదలకు బదులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోన్న కొంతమంది ప్రభుత్వ నేతల వల్ల నెతన్యాహు ప్రభావితమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలను ప్రధాని ఖండించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News