Big Stories

Indian Died in US: యూఎస్‌లో ఇండియన్‌పై దాడి.. అక్కడికక్కడే మృతి..!

Indian Spot Dead in US After Attack: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా యూఎస్ లో స్థిరపడిన భారతీయులు మిస్సింగ్, హత్యలు, ఆత్మహత్యలు, మృతి వంటి కేసులు తరచూ దారణంగా పెరిగిపోతున్నాయి. రోజుకు ఒక కథనం కింద ఇటువంటి వార్తలు వింటుండగా తాజాగా మరో వ్యక్తి మృతి చెందడం చర్చనీయాంశం అవుతోంది. యూఎస్ లో స్థిరపడిన ఓ ఇండియన్ అమెరికన్ దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

యూఎస్ లో మృతి చెందిన వ్యక్తిని గుజరాత్‌కు చెందిన హేమంత్ శాంతీలాల్ మిస్త్రీ (59)గా పోలీసులు గుర్తించారు. ఈయన ఓక్ల హోమాలో స్థిరపడి ఓ హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ తరుణంలో ఓ అమెరికన్ తో శాంతీలాల్ కు మధ్య చిన్న ఘర్షణ నెలకొంది. శాంతిలాల్ పని చేసే హోటల్ పార్కింగ్ స్థలంలో నిందితుడు లీవీస్ తన వస్తువులు పెట్టగా హేమంత్ ఖాళీ చేయమన్నాడు. ఈ తరుణంలో ఒకరితో ఒకరికి వాగ్వాదం నెలకొంది.

- Advertisement -

ఈ క్రమంలో శాంతీలాల్ పై లీవీస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఒక్కసారిగా లీవీస్ శాంతీలాల్ ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు. దీంతో శాంతీలాల్ వెనుకకు కుప్పకూలిపోయాడు. ఇక లీవీస్ అక్కడి నుండి తన వస్తువులను తీసుకుని నెమ్మదిగా ఆ స్థలం నుంచి జారుకున్నాడు. దీంతో వెంటనే శాంతీలాల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: US on Pak Elections: పాక్ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా తీర్మానం.. ఎందుకంటే ?

ఈ ఘటన జూన్ 22వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో వెలుగుచూసిందని. ఈ ఘటనలో నిందితుడు లీవీస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News