Big Stories

Hajj pilgrims: మక్కాలో తీవ్రమైన వేడి.. 90 మంది భారతీయులు మృతి

Hajj pilgrims: పవిత్ర హజ్ యాత్ర విషాదాంతం అయింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో  ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక హజ్ యాత్రికులు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా యాత్రికులు మృతి చెందుతున్నారు. ఇక ఇప్పటికే హజ్ యాత్రికులు వెయ్యి మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే మరణించిన భారతీయుల సంఖ్యపై సౌదీ అధికారులు కానీ, భారత ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి. ఈ సారి యాత్రలో 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన వారు ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు. మరో రెండు లక్షల మంది సౌదీ అరేబియా వాసులని అన్నారు.

- Advertisement -

చనిపోయిన యాత్రికుల్లో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతే కాకుండా జోర్డాన్, ఈజిప్ట్, దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 323 మంది ఈజిప్టుకు చెందిన వారు మరణించగా.. 90 మందికి పైగా జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో 90 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

Also Read: సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో చైనా దాడి

జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలని ముస్లింలు భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మక్కాను సందర్శించే హజ్ యాత్రికులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఈ ఏడు అత్యధిక సంఖ్యలో యాత్రికులు హజ్‌ను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. కానీ ఎండ తీవ్రత వల్ల యాత్రకు వచ్చిన వారిలో చాలా మంది మరణించగా వేల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News