Big Stories

Hajj Pilgrims Died : హజ్ యాత్రలో విషాదం.. 550 మంది యాత్రికులు మృతి

550 Hajj Pilgrims Died in Mecca(current news in world): సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ముగిసింది. ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని ఎదురుచూస్తుంటారు. తమ పాపాలను ప్రక్షాళన చేయాలని, దేవుడిని క్షమాపణలు కోరుతూ ఈ యాత్ర చేస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో హజ్ యాత్ర చేపడుతారు. ఐదురోజులపాటు జరిగే ఈ యాత్ర బక్రీద్ పండుగతో ముగుస్తుంది. ఈ ఏడాది జరిగిన హజ్ యాత్ర విషాదంతో ముగిసింది. మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటడంతో.. యాత్రికులు అధిక వేడిని తట్టుకోలేక కన్నుమూశారు. సోమవారం మక్కా మసీదులో 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

- Advertisement -

హజ్ యాత్రకు వెళ్లి మరణించిన వారిలో అత్యధికంగా ఈజిప్టుకు చెందిన వారే ఉన్నారని అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. వారిలో ఒకరు మినహా.. 322 మంది ఈజిప్టు యాత్రికులు అధిక వేడి కారణంగా మరణించారని స్పష్టం చేశారు. మరో 60 మంది జోర్డానియన్లు ఉన్నారన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు 18.3 లక్షల మంది రాగా.. వారిలో 22 దేశాల నుంచి 16 లక్షల మంది వచ్చినట్లు తెలిపారు. మృతదేహాలను మక్కాలోని అతిపెద్ద శవాగారంలో భద్రపరిచామని, వారిని తమ సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

అధిక వేడి వల్ల అనారోగ్యానికి గురైన మరో 2000 మంది యాత్రికులకు చికిత్స చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది 240 మంది హజ్ యాత్రికులు మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది ఇండోనేషియన్లే ఉన్నారు. ఇప్పటివరకూ హజ్ యాత్రలో 136 మంది ఇండోనేషియన్లు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News