Big Stories

Kalki 2898 AD OTT Release: కల్కి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎందులో చూడొచ్చు అంటే..?

Prabhas Kalki 2898 AD OTT Partner and Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం కల్కి9898AD. ఎన్నో వాయిదాలను దాటుకొని ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్ తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

- Advertisement -

మహాభారతంకు సైన్స్ ఫిక్షన్ కథను జోడించి నాగీ.. ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మొత్తం విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. బాహుబలి తరువాత ప్రభాస్ అందుకున్న అత్యంత భారీ విజయం ఇదే అని చెప్పాలి. భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడు. ఎక్కడా ప్రేక్షకులను నొప్పించకుండా నాగీ టేకింగ్ కానీ, కథను చూపించడం కానీ అద్భుతమని చెప్పుకోవచ్చు.

- Advertisement -

ఇక స్టార్ క్యాస్టింగ్ గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు.. ఏ ఒక్కరిని వదలకుండా సినిమాలో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. రూ. 600 కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన ఈ సినిమాను అభిమానూలు తెగ పొగిడేస్తున్నారు. సూపర్ .. సూపర్ అంటూ చెప్పుకోస్తున్నారు. ఇక ఇంకొంతమంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్నారు.

Also Read: Naga Shourya: దర్శన్ కు సపోర్ట్ చేసి ఉన్న మంచి పేరును కూడా పోగొట్టుకున్న హీరో..

ఇక కల్కి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అమెజాన్ లో భైరవ అండ్ బుజ్జి కథను రెండు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక సినిమాను కూడా అమెజాన్ సొంతం చేసుకుంది. కళ్ళు చెదిరే అమౌంట్ కు అమెజాన్.. కల్కి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ప్రతి సినిమా దాదాపు నాలుగు వారాల్లో ఓటీటీ బాట పడుతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా మాత్రం ఓటీటీ లోకి రావడానికి టైమ్ పడుతుందని అంటున్నారు.

ఇప్పుడప్పుడే కల్కి ఓటీటీలోకి రాదని టాక్ నడుస్తోంది. ఇంకోపక్క ఇలాంటి విజువల్ వండర్ ను టీవీ లో చూడలేమని.. థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పుకొస్తున్నారు. మరి కల్కి ఎప్పుడు ఓటీటీలో వస్తుందో ఎదురుచూడడం కంటే.. థియేటర్ కు వెళ్లి ఆ విజువల్ వండర్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనీ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News