Big Stories

Vishwak Sen: నీకు దమ్ముంటే ఆ పని చేసి చూపించు.. యూట్యూబర్ పై విశ్వక్ ఫైర్

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్నీ అయినా ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఎవరు ఏం అనుకున్నా పర్లేదు అనే టైప్ లో ఉంటాడు. అలానే ఇప్పటివరకు చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఇక తాజాగా విశ్వక్.. యూట్యూబ్ రివ్యూయర్స్ పై ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతి ఒక్కరు ఒక మైక్ పెట్టుకొని సినిమా కూడా చూడకుండా రివ్యూ చెప్పి సి ప్రేక్షకులను సినిమాలకు కూడా వెళ్లనివ్వకుండా చేస్తున్నారు.

- Advertisement -

వందల మంది కష్టాన్ని ఒక్క షో చూసి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం యూట్యూబ్ లో కామెంట్స్ కోసం, రీచ్ కోసం.. బాగున్నా సినిమాను కూడా బాలేదని నెగెటివ్ ప్రచారం చేసి.. చాలా సినిమాలు ప్లాప్ అయ్యేలా చేశారు. ఇక తాజాగా కల్కి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే నెగెటివ్ టాక్ ను ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

తాజాగా  కల్కి ట్రైలర్ గురించి బార్బెల్ బిర్యానీ అనే పేరుతో రివ్యూస్ చెప్పే యూట్యూబర్ కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. “హాలీవుడ్ ను దున్నేద్దాం.. హాలీవుడ్ ఎంత అనుకుంటున్నారేమో..కానీ, అలా అనుకున్నవారు ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చూసి ఉండలేదు అని చెప్తున్నాను. ఈ సినిమాలో ఎలాంటి ఫాల్ట్ లేదు. ఒరిజినల్ స్టోరీ అనిపిస్తుంది. కానీ, రిఫరెన్స్ లు ఎక్కువ హాలీవుడ్ మూవీస్ నుంచే తీసుకున్నారు” అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పై విశ్వక్ ఫైర్ అయ్యాడు.

ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ.. ” సినిమాలు రిలీజ్ కూడా అవ్వకముందే.. చెంబు పట్టుకొని బయల్దేరుతున్నారు. యూట్యూబ్ లో మీ ఇన్ కమ్ కోసం 1000 మంది కుటుంబాలు రన్ అవుతున్న ఇండస్ట్రీతో మజాక్ లు అయిపోయినాయ్ మీకు. వీడు ఒక 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రెస్స్ తప్పిపోయినవాళ్లని ఇగ్నోర్ చేద్దాం.

10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి ఇలాంటి ఒపీనియన్స్ బయట బజార్ లో పెట్టి తిరిగేవాళ్లు అందరూ. ఇలాంటి కొందరు సినిమా ఫైరసీ కంటే చాలా డేంజర్. ఒక సినిమా సెట్ లో ఎంతమంది చెమట, రక్తం ధారపోసి పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. నువ్వు తీయ్ .. ఒక షార్ట్ ఫిల్మ్.. అప్పుడు నీకు, నీ ఒపీనియన్ కు ఒక రెస్పెక్ట్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News