Big Stories

Vishwak Sen: ఇన్స్టాగ్రామ్ డిలీట్.. అదే కారణమా.. ?

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఒక మాట పెట్టుకొని బయటకు ఇంకోమాట చెప్పే రకంలో విశ్వక్ ఎప్పుడు ఉండడు. ఏది మాట్లాడినా నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అలా చెప్పి చాలాసార్లు వివాదాల్లో ఇరుకున్న విషయం కూడా తెల్సిందే.

- Advertisement -

ఇక అలాంటి విశ్వక్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ట్రోలింగే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. గత కొన్నిరోజుల క్రితం విశ్వక్.. ఒక యూట్యూబర్ పై ఫైర్ అయ్యాడు. కల్కి ట్రైలర్ పై యూట్యూబర్ నెగెటివ్ గా మాట్లాడడంతో అది నచ్చని విశ్వక్.. సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు.

- Advertisement -

ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసి అప్పుడు రివ్యూలు ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వివాదం రెండు మూడు రోజుల వరకు నడించింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇక సదరు యూట్యూబర్ తో పాటు నెటిజన్స్ సైతం విశ్వక్ పై ట్రోలింగ్ కు దిగారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై నెగటివ్ టాక్ ఇవ్వడంతోనే విశ్వక్ ఇలా మండిపడుతున్నాడని చెప్పుకొచ్చారు.

ఈ వివాదం ఉన్నకొద్దీ ఎక్కువ అవుతుండంతో విశ్వక్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా అతను ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వివాదాలను పక్కన పెట్టి విశ్వక్ సినిమాపై ఫోకస్ చేస్తున్నాడట. ప్రస్తుతం విశ్వక్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెకానిక్ రాకీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా.. ధమ్కీ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News