Big Stories

Vishwak Sen: గొప్ప పని చేసిన విశ్వక్.. శభాష్ అంటున్న ఫ్యాన్స్

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా విశ్వక్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

ఈ కాలంలో చాలామంది.. అవయవ దానం చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ, విశ్వక్ సేన్ మాత్రం ఎలాంటి భయం లేకుండా అవయవదానం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. తాజాగా విశ్వక్ మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. తాము చనిపోయాక అవయవ దానం చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిపే అవగహన సదస్సు అన్నమాట.

- Advertisement -

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ తన అవయవాలను దానం చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేసాడు. అంతేకాకుండా తన అవయవాలను దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి పని చేసినందుకు అభిమానులు.. విశ్వక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం విశ్వక్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్రయత్నించాడు కానీ, అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు మంచి హిట్ అందుకోవాలని.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడట విశ్వక్. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను అధికారికంగా చెప్పనున్నాడు. మరి ఈ సినిమాలతో విశ్వక్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News