Big Stories

Vijayashanti Birthday: కళ్యాన్ రామ్ సినిమాలో విజయశాంతి.. పాత రోజులను గుర్తు చేసిన లేడీ సూపర్ స్టార్!

Vijayashanti Birthday Special #NKR 21 Glimpse: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గుర్తొస్తాయి. ఆమె చేసిన సినిమాలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటాయి. విజయశాంతి నటన అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ పాత్రల్లో ఆమె జీవించిందనే చెప్పాలి. వైజయంతి ఐపీఎస్ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేదు. ఇప్పుడు అదే పాత్రలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది విజయశాంతి. తాజాగా విజయశాంతి బర్త్ డే సందర్భంగా కల్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి సర్ ప్రైజ్ గ్లింప్స్ విడుదల చేశారు.

- Advertisement -

విజయశాంతి ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మొదలుపెట్టారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇంతవరకూ మరో సినిమాలే కనిపించలేదు. అయితే కథ బాగుంటే.. మంచి క్యారెక్టర్ చేయడానికి ఎదురుచూస్తుండగా.. కల్యాణ్ రామ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో రాములమ్మ నటిస్తుందనే కంటే జీవిస్తుందని చెప్పాలి. పైగా అదే వైజయంతి ఐపీఎస్ పాత్రలో నటిస్తుందంటే.. ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

- Advertisement -

తాజాగా రిలీజైన ఈ గ్లింప్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లో విజయశాంతిని చూపించారు మేకర్స్. పోలీస్ డ్రెస్ లో.. ఒకప్పటి విజయశాంతిలాగే కనిపించామె. వైజయంతి ఐపీఎస్.. తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యూనిఫాం కి పౌరుషం వస్తుందన్న ఇంట్రడక్షన్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ డైలాగ్స్ కల్యాణ్ రామ్ చెప్పడం గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచాయి. ఇంకెందుకు లేటు.. మీరు కూడా వైజయంతి ఐపీఎస్ గ్లింప్స్ ను ఓసారి చూడండి.

Also Read: Allu sireesh buddy: టెడ్డీ, బడ్డీ వేరు వేరని అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్.. తగ్గేదేలే అంటున్న ‘బడ్డీ’ ట్రైలర్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News