BigTV English

VijayasaiReddy : బాలయ్యకు ఓదార్పు.. చంద్రబాబుతో మాటలు.. తారకరత్న మరణంపై విజయసాయిరెడ్డి ఆవేదన..

VijayasaiReddy : బాలయ్యకు ఓదార్పు.. చంద్రబాబుతో మాటలు.. తారకరత్న మరణంపై విజయసాయిరెడ్డి ఆవేదన..

VijayasaiReddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎంతో ఘాటుగా విమర్శిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు విపరీత ధోరణిలో ఉంటాయని విమర్శ ఉంది. చంద్రబాబు పేరు ఎత్తితే చాలు ఒంటికాలిపై లేస్తారు. ఎన్నోసార్లు మీడియా ముందు టీడీపీ అధినేతను దారుణంగా దూషించారు. ఇవన్నీ రాజకీయంగా చేసే విమర్శలే. రాజకీయంగా వైరం ఎంత ఉన్నా వ్యక్తిగతంగా నేతల మధ్య కక్షలు ఉండవని నిరూపించే ఓ ఘటన తాజాగా జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో విజయసాయి పక్కనే కూర్చుని మాట్లాడటం ఆసక్తిని కలిగించింది.


విజయసాయిరెడ్డి తాజాగా నందమూరి ఇంటి జరిగిన విషాదంపై ఎంతో ఆవేదన చెందారు. తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు బెంగళూరు వెళ్లి పరామర్శించారు. బాలకృష్ణను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలయ్య దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారని ఆ సమయంలో చెప్పారు.

తారకరత్న పార్థీవదేవం హైదరాబాద్ లోని నివాసం తరలించగానే విజయసాయిరెడ్డి వచ్చారు. చాలాసేపు అక్కడే ఉన్నారు. నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆవేదనతో ఉన్న బాలకృష్ణను విజయసాయిరెడ్డి ఓదార్చారు. ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో విజయసాయిరెడ్డి మాట్లాడారు.


తారకరత్నకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబు వెళ్లినప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. చంద్రబాబు పక్కనే కూర్చున్నారు. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. టీడీపీ అధినేత కూడా విజయసాయిరెడ్డి ఎదో చెబుతుంటే తలకిందకు వంచి మరీ చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు. చాలాసేపు వారిద్దరూ మాట్లాడుకోవడం ఆసక్తినిరేపింది.

తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డికి సమీప బంధువు. దీంతో ఆయన చాలాసేపు తారకరత్న ఇంటి వద్దే ఉన్నారు. భర్త మృతితో అలేఖ్యారెడ్డి తీవ్ర ఒత్తిడికి గురై, నీరసించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారని చెప్పారు.

మరోవైపు ఉదయం శంకర్‌పల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహాన్ని తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

Taraka Ratna : బాలయ్య భావోద్వేగం.. తారకరత్న భార్యా,పిల్లలు కన్నీరు..

Taraka Ratna : తాత ఎన్టీఆర్ అంటే అభిమానం.. పిల్లలంటే ప్రాణం.. అందుకే వారి పేర్లు ఇలా..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×