E-Paper
Advertisement

Taraka Ratna : తాత ఎన్టీఆర్ అంటే అభిమానం.. పిల్లలంటే ప్రాణం.. అందుకే వారి పేర్లు ఇలా..!

Taraka Ratna : తాత ఎన్టీఆర్ అంటే అభిమానం.. పిల్లలంటే ప్రాణం.. అందుకే వారి పేర్లు ఇలా..!

Taraka Ratna : ఎన్టీఆర్‌ ఐదో కుమారుడు నందమూరి మోహనకృష్ణ తనయుడు తారకరత్న. మోహనకృష్ణ ప్రముఖ ఛాయాగ్రాహకుడు. ఎన్టీఆర్‌ నటించిన పలు చిత్రాలకు కెమెరామెన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తారకరత్న 2002లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్నేహితుల ద్వారా పరిచయమైన అలేఖ్యరెడ్డితో ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గుడిలో 2012లో అలేఖ్యరెడ్డిని వివాహం చేసుకున్నారు. అలేఖ్యరెడ్డి కాస్ట్యూమ్‌ డిజైనర్‌. తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకి ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు.

తారకరత్న, అలేఖ్యరెడ్డి దంపతులకు 2013లో పాప జన్మించింది. ఆ అమ్మాయికి నిష్కా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత కవల పిల్లలు బాబు,పాప పుట్టారు. వారికి తాన్యారామ్, రేయా అని నామకరణం చేశారు. తాత నందమూరి తారక రామారావు అంటే తారకరత్నకు ఎంతో అభిమానం. తాత జ్ఞాపకంగా తన పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు. తారకరత్న పిల్లల పేర్లలో మొదటి అక్షరాలు తీసుకుంటే NTR అవుతుంది. N( నిష్కా) T( తాన్యారామ్ ) R ( రేయా) . తాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఇలా పేర్లు పెట్టారని తారకరత్న సన్నిహితులు చెబుతున్నారు.

తారకరత్న పెద్దలను ఎంతో గౌరవించేవారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఎంతో బాగా చూసుకునేవారని అందరూ చెబుతుంటారు. తారకరత్నకు ముగ్గురు పిల్లులను ఎంతో బాగా పెంచుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పేమాట. కానీ ఆ పిల్లలకు ఇప్పుడు తండ్రి లేడు. తండ్రి పార్థివదేహం వద్ద ఆ పిల్లలు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కదిలిస్తున్నాయి.

VK Naresh: న‌రేష్ వాహ‌నంపై దాడి..ఆమె కార‌ణ‌మంటున్న సీనియ‌ర్ న‌టుడు

VijayasaiReddy : బాలయ్యకు ఓదార్పు.. చంద్రబాబుతో మాటలు.. తారకరత్న మరణంపై విజయసాయిరెడ్డి ఆవేదన..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×